ఆంధ్రప్రదేశ్‌

సాధారణ ఎన్నికలకు సిద్ధంకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 16: రాష్ట్రంలో 2019 సంవత్సరంలో జరగనున్న సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు, సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సిపిఒ సమావేశ మందిరంలో ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలతో స్పెషల్ సమ్మరి రివిజన్, ప్రీ రివిజన్ కార్యకలాపాలపై ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న పాత పోలింగ్‌స్టేషన్ భవనాలన్నింటిని తనిఖీ చేపట్టాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో భారత ఎన్నికల సంఘం ఆదేశాలననుసరించి తాగునీరు. విద్యుత్, ర్యాంప్, మరుగుదొడ్ల సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిజిస్ట్రేషన్, సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులకు సూచించారు. ఓటర్ల జాబితాలో యువ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాధారణ ఎన్నికల నేపధ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు.