ఆంధ్రప్రదేశ్‌

ఏజెన్సీలో గంజాయి మాఫియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), సెప్టెంబర్ 18: విశాఖ ఏజెన్సీలోని 102 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసినట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, ఎక్సైజ్ ఎఇసి బాబ్జీరావు తెలియచేశారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గంజాయి పంట సాగును నిర్మూలించేందుకు ఎక్సైజ్, పోలీసు శాఖలు సంయుక్త కార్యాచరణ చేపట్టినట్టు చెప్పారు. గంజాయి రవాణా జరిగే ఎనిమిది మార్గాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలియచేశారు. జి.మాడుగుల, హుకుంపేట, పాడేరు, పెదబయలు మండలాల్లో 102 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేశామని చెప్పారు. గంజాయి స్మగ్లర్లను, దళారులను, పండించేవారిని పట్టుకుని వారిపై పి.డి యాక్ట్ కింద కేసు నమోదు చేసి, వారి ఆస్తులు జప్తు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియచేశారు. అనకాపల్లికి చెందిన ఊడి బాబ్జి గంజాయి వ్యాపారం చేస్తూ సంపాదించిన రెండస్తుల భవనాన్ని 234.6 గ్రాముల బంగారాన్ని, 40 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2016లో ఏడుగురు, ఈ ఏడాది ఇప్పటి వరకూ ఏడుగురిపై పి.డి.యాక్ట్ కింద కేసు నమోదు చేశామని తెలియచేశారు. గంజాయి స్మగ్లింగ్‌తో సంబంధాలు ఉన్నాయని తెలిసి ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని, తొమ్మిది మంది హోంగార్డులను విధుల నుంచి తొలగించామని ఎస్పీ చెప్పారు. ఏజెనీ ప్రాంతంలో 151 గ్రామాల్లో మూడు వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోందని ఎస్పీ తెలియచేశారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, ఎక్సైజ్ ఎఇసి బాబ్జీరావు