ఆంధ్రప్రదేశ్‌

మూడు శాఖలపై సిఎం సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 21: జిల్లా కలెక్టర్ల సదస్సులో మూడు శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ హాజరు యంత్రాల కొనుగోలులో విద్యా శాఖ వ్యవహరించిన తీరుపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు క్లాస్ తీసుకున్నారు. గర్భిణులకు కేంద్రం అందచేస్తున్న ఆర్థిక సాయం విషయంలో ఇతర శాఖలతో చర్చించకపోవడంపై వైద్య, ఆరోగ్య శాఖ, స్ర్తి, శిశు సంక్షే మ శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో జరుగుతున్న రెండు రోజు ల జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన సోషల్ ఎంపవర్‌మెంట్ మిషన్‌లో భాగంగా పాఠశాల విద్యపై సమీక్ష నిర్వహించారు. పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి ఆ శాఖకు సంబంధించి వివిధ అంశాలను వివరిస్తూ, పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరును అమలు చేస్తున్నామని తెలిపారు. దీనిపై స్పందించిన ఒక జిల్లా అధికారి, తమ జిల్లాలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ హాజరు విధానం పనిచేయడం లేదని సిఎంకు తెలిపారు. నాలుగు యంత్రాలను కలిపి ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాటు చేశారని, ఫిర్యాదు చేస్తే తమ యంత్రాల్లో తప్పు లేదంటూ ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారని తెలిపారు. దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ సిఎంకు చెప్పారు. దీనిపై స్పందించిన సిఎం బయోమెట్రిక్ హాజరుకు నాలుగు యంత్రాలను అమర్చడమేమింటూ విద్యా శాఖ అధికారిని ప్రశ్నించారు. టెండర్లను వేరే సంస్థ పిలిచి, పాఠశాలల్లో ఏర్పాటు చేసిందని తెలిపారు. మూడు,నాలుగ ఏజన్సీలకు ఎందుకు ఇచ్చారని సిఎం ప్రశ్నించారు. చేతకాకపోతే అడగాలి కదా ? అని ప్రశ్నించారు. విఫలం చేసేందుకు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లోకి వెళ్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితం వచ్చేలా ఉండాలని ఎన్నిసార్లు చెబుతున్నా, అర్థం చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోకపోవడం అంటే సరైన నాయకత్వం లేకపోవడమేనన్నారు. రియల్ టైమ్ గవర్నెన్సును అమలు చేసేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో ఇంకా బయో మెట్రిక్ విధానం అమలు చేయలేకపోవడాన్ని తప్పుపట్టారు. మూడు సంవత్సరాలు కావస్తున్నా, విద్యా శాఖ తీరు బలహీనంగా ఉందని వ్యాఖ్యానించారు. చిన్న విషయాలను కూడా కొన్ని శాఖలు సమస్యగా మారుస్తున్నాయన్నారు. ఈ శాఖలో జరుగుతున్న వ్యవహారాలను గమనించాలంటూ మంత్రి గంటా శ్రీనివాసరావును ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన నాయకత్వం కావాలని, చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి గంటా.. తనను బయోమెట్రిక్ హాజరుకు సంబంధించి పరికాలను అడిగితే, కొనుగోలు చేయమన్నానని, నిర్దిష్టంగా తనకు వాటి గురించి తెలియదన్నారు. అయినా పాలిటెక్నిక్‌ల్లో ఏర్పాటు చేసిన యంత్రాలు పని చేస్తున్నాయని గుర్తు చేశారు. విద్య, వైద్య శాఖపై దృష్టిపెట్టాలని కలెక్టర్లను సిఎం కోరారు. విద్యా శాఖలో చాలా మా ర్పులు తేవాలన్నారు. బయోమెట్రిక్ విధానానే్న సరిగా అమలు చేయని నేపథ్యంలో, పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు 5000 కోట్ల రూపాయలు ఇస్తే ఏలా చేస్తారంటూ ప్రశ్నించారు. ఎలా హ్యాండిల్ చేస్తారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక నెల లో పరిస్థితిలో మార్పురావాలని, నెలవారీగా ప్రణాళిక అందచేయాలని ఆదేశించారు.
సమన్వయం చేసుకోకపోతే ఎలా?
వైద్య, ఆరోగ్య శాఖ గురించి ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య వివిరిస్తూ, ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 6 వేల రూపాయలను ప్రోత్సాహకంగా ఇస్తున్నదని తెలిపారు. ఇది మూడు విడతలుగా మహిళ ఖాతాలోకి నిధులు జమ అవుతాయని తెలిపారు.
దీనిపై స్పందించిన సిఎం, ఈ పథకం ఎప్పటి నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకమని, గత అక్టోబర్ నుంచి అమలు చేస్తున్నామని, ఇంకా నిధులు విడుదల కాలేదని తెలిపారు. దీంతో రెండు శాఖలు సమన్వయం చేసుకుని పథకం అమలు చేయడం వల్ల రక్తహీనత తదితర సమస్యలు కలుపుతూ సమగ్ర పథకంగా అమలు చేసే వీలు ఉండేది కదా? అని ప్రశ్నించారు.