ఆంధ్రప్రదేశ్‌

అధికారి లేని అసెంబ్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 21: చట్టాలు రూపొందించే చట్టసభకు బాధ్యుడు లేని పరిస్థితి నెలకొంది. వెలగపూడిలోని శాసనసభ కార్యాలయానికి ఇప్పటివరకూ పూర్తిస్థాయి కార్యదర్శిని నియమించని ప్రభుత్వం, కనీసం తాత్కాలిక ఇన్చార్జిని కూడా నియమించకుండా తాత్సారం చేస్తోంది. అసెంబ్లీ కార్యదర్శి రామాచార్యులు ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడుకు ఓఎస్డీగా వెళ్లిన నాటి నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. పూర్తి స్థాయి కార్యదర్శి నియామకం అయ్యేవరకూ కనీసం ఇన్చార్జి కార్యదర్శిగా ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించకపోవడంతో ఉద్యోగుల సమయపాలన, ఇతర వ్యవహారాలపై నియంత్రణ లేకుండా పోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు అత్యంత కీలకమైన క్వశ్చన్స్ సెక్షన్‌కు కౌన్సిల్ ఓఎస్డీని నియమించడంపై టిడిపి ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో విప్, టిడిఎల్పీ అభిప్రాయం పరిగణనలోకి తీసుకోకుండానే నియమించారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అత్యంత కీలకమైన ఆ విభాగానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి అనుకూలమైన అధికారిని నియమిస్తారని చెబుతున్నారు. ప్రశ్నలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఇచ్చే ప్రశ్నలను కొన్ని సందర్భాల్లో వాయిదా వేయడమో, దాని బదులు మరొకటి ఇవ్వడమో చేస్తుంటారని వివరిస్తుంటారు. ఆ సందర్భాల్లో విప్, ప్రభుత్వం ఇబ్బందిపడకుండా తమకు అనుకూలంగా ఉండే అధికారిని నియమించుకుంటుంది. ముఖ్యంగా ఆ అధికారికి విప్, టిడిఎల్పీ కార్యాలయంతో సత్సంబంధాలు ఉండాలి. కానీ కార్యదర్శిగా పనిచేసిన రామాచార్యులు ఢిల్లీకి వెళుతూ, కౌన్సిల్ ఓఎస్డీ నేపథ్యం ఉన్న అధికారిని తమతో సంప్రదించకుండానే నియమించి వెళ్లారని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కాగా.. అసెంబ్లీ చీఫ్ విప్ పదవిని ఇప్పటిదాకా భర్తీ చేయలేదు. శాసనమండలిలో కూడా కీలకమైన అన్ని పదవులూ ఖాళీగానే ఉన్నాయి. వీటిని భర్తీ చేయకపోవడంపై పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.