ఆంధ్రప్రదేశ్‌

రౌడీలు రాష్ట్రం వదిలిపోవాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 21: రౌడీలు రాష్ట్రం వదిలిపోవాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఏమాత్రం ఉపేక్షించవద్దని పోలీసుశాఖను ఆదేశించారు. తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై ఉక్కుపాదం మోపాలని, అక్రమ సంపాదనకు అలవాటు పడినవారే నేరాలకు పాల్పడుతున్నారన్నారు. పోలీసుశాఖలో అవినీతికి తావు ఉండరాదని సూచించారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, మైనర్లపై దాడులు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, క్రికెట్ బెట్టింగ్‌లు, తదితర వాటిని నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. రెండురోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా గురువారం విజయవాడలో శాంతిభద్రతలపై 13జిల్లాల ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తొలుత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, సిసి కెమెరాలు వినియోగం, సాంకేతిక పరిఙ్ఞనం, ఇతర కొత్త అంశాలకు సంబంధించి డిజిపి నండూరి సాంబశివరావు డెమో ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. క్రైం రేటు పెరుగుతున్నప్పటికీ.. వాటిని నియంత్రించే దిశగా సిసి కెమెరాలు, టెక్నాలజీ వినియోగంతో సత్ఫలితాలు సాధిస్తున్నట్లు చెప్పారు. అనంతరం జిల్లాల వారీగా ఎస్పీలు కలెక్టర్లతో కలిసి శాంతి భద్రతలకు సంబంధించి పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ఆయా జిల్లాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, రాజకీయ, కుల, మతపరమైన అంశాలు, అభివృద్ధికి ముడిపడిన ఉన్న లా అండ్ ఆర్డర్ అంశాలు వివరించారు. తాము తీసుకుంటున్న చర్యలు, ముందస్తు ప్రణాళికను తెలియచేశారు. జిల్లాల వారీగా విన్న ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధానంగా విశాఖ జిల్లా కేంద్రంగా జరుగుతున్న గంజాయి సాగుపై సీరియస్‌గా స్పందించారు. డ్రోన్ల వినియోగంతో గంజాయి సాగుకు చెక్ పెట్టేందుకు అవసరమైన సాంకేతికతను పరిశీలించాలని అధికారులకు సూచించారు. పంటను పూర్తిగా నాశనం చేయగలిగిన మార్గాలు అనే్వషించాలన్నారు. అదేవిధంగా గంజాయితో ఆగని మత్తు మాదక ద్రవ్యాల వినియోగం వరకు వెళ్ళకుండా అప్రమత్తం కావాలన్నారు. యువత, విద్యార్థులను భాగస్వామ్యం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఉద్యమించేందుకు అంశాలు వెతుక్కునే పరిస్ధితి ఉందని, దీంతో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదన్నారు. క్రికెట్ బెట్టింగ్, కోళ్ల పందేలు, ఎన్నికల్లో బెట్టింగ్‌లు, ఇతర అక్రమ ఆదాయ వనరులను నియంత్రించాలన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, బాలికలపై జరుగుతున్న దాడులను నియంత్రించాలన్నారు. గంజాయి కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని సూచించారు.
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం
ప్రత్యేకించి అగ్రిగోల్డ్ అంశం సదస్సులో ప్రస్తావనకు వచ్చింది. దీంతో సిఐడి డిజి ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు సుభాష్ ఫొండేషన్ ముందుకువచ్చిందని, ఇప్పటికే ఈ విషయాన్ని ఈనెల 14వ తేదీ వాయిదాలో కోర్టుకు తెలియచేశామన్నారు. మరలా ఈనెల 22న కేసు వాయిదా ఉందని, ఉన్నఫళంగా 10కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాల్సిందిగా సదరు సంస్థకు కోర్టు సూచించడంతో ఈదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 1200 కోట్లు వస్తే ఇప్పటికిప్పుడు 13లక్షల పైచిలుకు మందికి తక్షణ న్యాయం చేయవచ్చని చెప్పారు. సీఎం మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగరాదని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. సదస్సు అనంతరం స్విమ్మింగ్, టెన్నిస్ ఇతర క్రీడల్లో గోల్డ్‌మెడల్స్ సాధించిన పలువురు పోలీసుశాఖలోని అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. సదస్సులో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంటిలిజెన్స్ చీఫ్ పాల్గొన్నారు.

చిత్రం..శాంతి,్భద్రతలపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి.
పక్కన సిఎస్ దినేష్‌కుమార్, డిజిపి నండూరి సాంబశివరావు