ఆంధ్రప్రదేశ్‌

సాంకేతిక మార్పులు అలవర్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: సాంకేతికంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని, పురోగతి సాధించాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) సారథ్యంలో సాంకేతిక రంగంలో వస్తున్న పెనుమార్పులపై రెండు రోజుల సదస్సు విశాఖలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సదస్సు చైర్మన్, మ్యాపిల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఒ జిఎస్ శివకుమార్ మాట్లాడుతూ భవిష్యత్‌లో రానున్న మార్పులను సైతం అవగతం చేసుకుని ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలన్నారు. గత రెండుమూడేళ్లుగా ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఐఓటి-ఎఐ) ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఐఓటి-ఎఐ, డ్రోన్ టెక్నాలజీలు సమర్థవంతంగా వినియోగించుంటున్నాయన్నారు. గతంలో నూతన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఆయా రంగాల్లో మార్పులు చోటుచేసుకునేవని, ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్‌లో వచ్చే మార్పులను ముందుగానే ఊహించి, అందుకు అనుగుణమై పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సి ఉంటుందన్నారు. సిఐఐ చైర్మన్ జెఎస్‌ఆర్‌కె ప్రసాద్ మాట్లాడుతూ ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్ ప్రస్తుతం మానవాళి జీవనంలో ఒక భాగమైందన్నారు. ఐఓటి ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, సంపద సృష్టికి ఐఓటి, ఎఐలు దోహదం చేస్తాయన్నారు.
భారతీయ స్టేట్ బ్యాంకు డిజిఎం డి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో ఐఓటి, ఎఐ సేవలు విస్తృతమయ్యాయన్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థలో సమాచార రక్షణ, ఖాతాదారులకు సేవల విషయంలో ఐఓటి మంచి ఫలితాలిస్తోందన్నారు. సిఐఐ లీడ్ కన్వీనర్ డి రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశం తొలి రెండు పారిశ్రామిక విప్లవాల్లో సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో విఫలమైందన్నారు. మూడవ పారిశ్రామిక విప్లవం నాటికి సాంకేతికపై దృష్టి సారించిందన్నారు. ప్రస్తుతం ఐఓటి-ఎఐని అందిపుచ్చుకునే క్రమంలో నాలుగవ పారిశ్రామిక విప్లవానికి భారత్ సిద్ధ పడుతోందన్నారు.
సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ డైరెక్టర్ సివిడి రాంప్రసాద్ మాట్లాడుతూ డిజిటల్ లావాదేవీలపై భారత్ ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తోందన్నారు. సమ్మిళిత వృద్ధి సాధించే క్రమంలో ఐఓటి-ఎఐ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఐఓటి-ఎఐపై చర్చాగోష్ఠి నిర్వహించారు.

చిత్రం..సిఐఐ సదస్సులో మాట్లాడుతున్న ఎస్‌బిఐ డిజిఎం అశోక్ కన్నన్