ఆంధ్రప్రదేశ్‌

జూలైలోపు అమరావతికి మంత్రులు, ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుటౌన్, మే 23: జూలైలోపు అమరావతికి మంత్రులు, ఉద్యోగులు తరలి రానున్నారని రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి నారాయణ అన్నారు. సోమవారం నెల్లూరు నగరంలోని కస్తూర్బాదేవి గార్డెన్స్‌లో టిడిపి జిల్లా మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మినీమహానాడులో అమరావతిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టి దానిపై మాట్లాడారు. కేవలం 58 రోజుల్లో రైతులను ఒప్పించి ప్రపంచంలోనే వినూత్నంగా నవ్యాంధ్ర రాజధాని కోసం 33వేల ఎకరాలు సేకరించామని మంత్రి గుర్తుచేశారు. సిఎంపై నమ్మకంతో సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిందన్నారు. ఫిబ్రవరి 17న బహుళ అంతస్తుల భవనానికి శంకుస్థాపన చేసి జూలై 17లోపు 6 లక్షల చదరపు అడుగులలో పూర్తి చేసేందుకు ఆదేశించారని తెలిపారు. ఇది పూర్తయితే పాలన ఇక్కడినుంచే జరుగుతుందన్నారు. మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పథకం ప్రకారం పాలన సాగిస్తున్నారని కొనియాడారు. వౌలిక రంగాల అభివృద్ధిపై చంద్రబాబునాయుడు పూర్తిగా దృష్టి సారించారని, అందులో భాగంగా అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. సముద్రతీరం వెంబడి నాలుగు లైన్ల రోడ్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమైనట్లు మంత్రి వివరించారు. పార్టీ పరిశీలకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ రాష్ట్రం లోటులో ఉన్నా చంద్రబాబు ప్రజా సంక్షేమం పట్ల దృష్టిపెట్టారన్నారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. హోదా కోసం పోరాటాలు చేస్తున్నప్పటికీ కేంద్రం పట్టించుకోలేదన్నారు. బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పదేళ్లు ఇస్తామన్న విషయాన్ని గుర్తుచేశారు. హోదా విషయంపై బిజెపి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో ఉజ్వలంగా వెలుగుతోందని కొనియాడారు.

చిత్రం నెల్లూరు మినీ మహానాడులో మాట్లాడుతున్న మంత్రి నారాయణ