ఆంధ్రప్రదేశ్‌

సాగరమాల ప్రాజెక్టులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: సాగరమాల కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రతిపాదించిన వివిధ ప్రాజెక్టులను వేగవంతంగా చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో సాగరమాల కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ సాగరమాల ప్రాజెక్టు డైరెక్టర్ అభిషేక్ చంద్ర ఈ సమీక్షను నిర్వహించాల్సి ఉండగా ఆయన విజయవాడ చేరుకునేందుకు విమానం ఆలస్యం కావడంతో సాగరమాలపై సిఎస్ సమీక్షించారు. సాగరమాల కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమికంగా లక్షా 30 వేల 762 కోట్ల రూపాయల వ్యయంతో 90 ప్రాజెక్టులను చేపట్టేందుకు గుర్తించగా వాటిలో 60 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం మిగతా 30 ప్రాజెక్టులను విశాఖపట్నం పోర్టు ట్రస్టు చేపట్టేందుకు ప్రతిపాదించారు. తదుపరి కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వశాఖ సాగరమాల కార్యక్రమం కింద మొత్తం 106 ప్రాజెక్టులు విశాఖ పోర్టు ట్రస్ట్‌కు ఇవ్వగా మరో 4 ప్రాజెక్టులను మత్స్యశాఖకు ఇచ్చింది. వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 75 ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంది. కాగా వివిధ నోడల్ ఏజెన్సీల సమాచారం తీసుకున్నాక 48 ప్రాజెక్టులను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించగా వాటిలో 8 ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతతో తక్షణమే అమలు చేసేందుకు గుర్తించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ మాట్లాడుతూ సాగరమాల కార్యక్రమం కింద ప్రతిపాదించిన ప్రాజెక్టులకు సంబంధించి త్వరితగతిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డిపిఆర్స్) సిద్ధం చేసి కేంద్ర వాటా నిధులు మంజూరుకై కేంద్రానికి సమర్పించడంతో పాటు సకాలంలో ప్రాజెక్టులను చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధి అనుకున్నంత రీతిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేరళ, గోవా, రాజస్థాన్, కర్నాటక వంటి రాష్ట్రాల్లో ప్రైవేట్ భాగస్వామ్యంతో మెరుగైన రీతిలో ఈ రంగం అభివృద్ధి చెందిందని, అదే తరహాలో రాష్ట్రంలో కూడా పర్యాటకరంగాన్ని వృద్ధి చేసేందుకు కృషి చేయాలని సిఎస్ సూచించారు. ఇందన వౌలిక సదుపాయాలు, పెట్టుబడులశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జెఎస్పీ ప్రసాద్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్‌అండ్‌బి ముఖ్య కార్యదర్శి సుమితా దావ్రా, పర్యాటకశాఖ కార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా, ఎపి ఐఐసి ఎండి బాబు ఎ, నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాల రాజు, డైరెక్టర్ ఆఫ్ పోర్ట్సు డా.కోయ ప్రవీణ్, ఇంకా రైల్వే, జాతీయ రహదారులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.