ఆంధ్రప్రదేశ్‌

డ్వాక్రా మహిళ వార్షిక ఆదాయం రూ. లక్షా ఏడు వేలకు పెంచడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళ వార్షిక ఆదాయం 36 వేల నుంచి లక్షా ఏడు వేల రూపాయలకు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. విజయవాడలోని ఒక హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన రాష్టస్థ్రాయి ప్రాజెక్టు డైరెక్టర్స్ సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రతి డ్వాక్రా మహిళకు రూ.10 వేల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా 6 వేల రూపాయలు అందించామన్నారు. మిగతా 4 వేల రూపాయలు రాష్ట్రంలో లోటు బడ్జెట్ దృష్ట్యా దశలవారీగా ఇవ్వాలనుకున్నామన్నారు. అయితే డ్వాక్రా మహిళల పనితీరుకు మెచ్చి అక్టోబర్ మొదటివారంలో 2 వేల రూపాయలు ఇవ్వాలని మిగతా 2 వేలు 2018 జనవరికి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. ఈ పదివేల రూపాయల పెట్టుబడి నిధిని డ్వాక్రా మహిళలు 68 శాతం మంది వ్యాపారాల కోసం వాడుకుంటుండగా 9 శాతం మంది విద్య, 5 శాతం మంది ఆరోగ్యం, 13 శాతం మంది కుటుంబ అవసరాలకు, 5 శాతం ఇతర అవసరాల నిమిత్తం వాడుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడే సమయానికి ప్రతి డ్వాక్రా మహిళ వార్షిక ఆదాయం 36 వేలుగా ఉందని ఈ మూడు సంవత్సరాలలో ప్రభుత్వం డ్వాక్రా మహిళలను ప్రోత్సహించడం వల్ల అది 82 వేలకు చేరిందన్నారు. వీరి ఆదాయాన్ని లక్షా 7 వేల రూపాయలకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారన్నారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల సగటు ఆదాయం లక్షా 7 వేల రూపాయలు ఉండగా డ్వాక్రా మహిళల ఆదాయం మరీ తక్కువగా వుందన్నారు. డ్వాక్రా/మెప్మా మహిళల ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరుగుతుందని అంతేకాకుండా పేదల, నిరుపేదల ఆదాయం పెరగాల్సిన అవసరం వుందన్నారు. 15 మంది మెప్మా పిడిలు, 90 మంది సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్, 110 మంది కో ఆర్డినేటర్లు వివిధ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నారన్నారు. వీరంతా డ్వాక్రా/మెప్మా మహిళలకు చేదోడు వాదోడుగా వుంటూ వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీరికి అందించడంలో సహాయ సహకారాలు అందిస్తారన్నారు. రాష్ట్రంలో ప్రతి 25-35 మంది డ్వాక్రా మహిళలకు స్వచ్ఛందంగా సేవలందించే ఒక మహిళను అనుసంధానం చేస్తామని తెలిపారు. స్టేట్ వైడ్ ప్రాజెక్టు డైరెక్టర్ల కార్యక్రమంలో 13 జిల్లాల పిడిలు, టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్, స్టేట్‌వైడ్ మిషన్ డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణకు సెంట్రల్ కంట్రోల్ రూం
దేశంలోనే తొలిసారిగా పారిశుద్ధ్య నిర్వహణకు సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేశామని పురపాలకశాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. విజయవాడలో జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ సదస్సులో శుక్రవారం మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల రోజుల్లో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయడానికి అన్ని మున్సిపాలిటీల్లో అనుబంధ కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నామనన్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మున్సిపల్ శాఖ మంత్రితో భేటీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖలో జరుగుతున్న కార్యక్రమాలు బాగున్నాయని ప్రశంసించారని చెప్పారు. ఇతర రాష్ట్రాల అధికారులు పరిశీలించాలని కూడా ఆదేశాలు జారీ చేశారన్నారు. దేశంలో ఆన్‌లైన్ భవన నిర్మాణ అనుమతులు తెచ్చిన తొలి రాష్ట్రం కూడా మనదేనని ఆయన తెలిపారు. సమాజంలో మార్పుకు నాంది పలికేది విద్యేనని అందుకు విద్యే ప్రామాణికంగా భావించి ఈ ప్రభుత్వం మున్సిపల్ స్కూల్స్‌లో ఫౌండేషన్ కోర్సు ప్రవేశ పెట్టామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అంగన్ వాడీలను ప్రీ స్కూళ్లుగా మార్చిన ఘనత కూడా ఎపి మున్సిపల్ శాఖదేనన్నారు. దేశంలో ఎల్‌ఇడి వీధి దీపాలను అన్ని మున్సిపాల్టీలలో ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. అయితే చాలా చోట్ల వీధి దీపాలు వెగలడం లేదని, దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన డాష్ బోర్డులో చూసి అడుగుతున్నారన్నారు. ఈ మధ్య పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ విజయవాడ వీధి దీపాలు వెలగకపోవడంతో తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు. మున్సిపల్ కమిషనర్లు ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు.