ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రను రక్షించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 23: అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్‌ను తన చేతకాని తనంతో ముఖ్యమంత్రి థార్ ఎడారిగా మారుస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్న చంద్రబాబు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, ప్రధాని మోదీలను తరిమికొట్టి ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. తెలంగాణలో వేగవంతంగా సాగుతున్న అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలకు వ్యతిరేకంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని గాంధీనగర్‌లో మండుటెండలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, సీనియర్ నేతలు చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా విభజన చట్టం ద్వారా సంక్రమించిన హక్కులను, ప్రయోజనాలను సాధించుకోలేక పోవడంతో పాటు కృష్ణానదిపై తెలంగాణలో అక్రమంగా నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలను అడ్డుకోలేక పోతున్నందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తాను ఎక్కడ జైలుకెళ్లాల్సి వస్తుందోననే భయం ఒకవైపు, తెలంగాణలో తన ఆస్తులు కాపాడుకోవాలనే తపనతోనే కెసిఆర్‌తో రాజీపడ్డారని ఆరోపించారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోలేక పోతున్న చంద్రబాబు కనీసం తమ పోరాటానికి మద్దతిస్తే చాలన్నారు. తక్షణం శాసనసభను సమావేశపరచి దీనిపై కేంద్రం జోక్యం కోరుతూ తీర్మానం చేయాలంటూ డిమాండ్ చేశారు.
పిసిసి అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి మాట్లాడుతూ గతంలో బాబ్లీ ప్రాజెక్టును 2 టిసిఎంల నీటి కోసం ఎత్తు పెంచినప్పుడు, పరగోడు గ్రామంలో చిన్న చెరువుకు నీటిని మళ్లించే సమయంలోనూ చంద్రబాబు వందలాది కార్యకర్తలతో వెళ్లి అక్కడి కర్నాటక ప్రభుత్వంపై నానా యాగీ చేశారని గుర్తుచేశారు. అయితే కెసిఆర్ ఇప్పుడు ఏకంగా 161 టిఎంసిల నీటిని అక్రమంగా మళ్లించేందుకు రూ.50వేల కోట్లకు పైగా కేటాయించి శంకుస్థాపనలు చేసి టెండర్లు పిలచినా చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు మాట్లాడుతూ కేంద్ర మంత్రులు జిల్లాల్లో పర్యటించే సమయాల్లో ప్రత్యేక హోదా కోసం నిరసనలు తెలపాలంటూ కలసివచ్చే పార్టీలతో ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రకటించాలని రఘువీరాను కోరారు. కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, కిల్లి కృపారాణి తమ ప్రసంగాల్లో కేవలం కమిషన్ల కోసం పట్టిసీమను తెరపైకి తెచ్చి పోలవరానికి తిలోదకాలిచ్చారని విమర్శించారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.60 నుంచి 80లు మించి దక్కడం లేదనీ, అదీ నెల తర్వాతే చేతికి అందుతోందన్నారు. ఇళ్ల మంజూరులో జన్మభూమి కమిటీలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

చిత్రం విజయవాడలో ధర్నాలో పాల్గొన్న రఘువీరా, కెవిపి, పల్లంరాజు, కాసు, నెహ్రూ తదితర నాయకులు.. ప్రసంగిస్తున్న పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి. ప్రకాశం బ్యారేజీ వద్ద కాంగ్రెస్ నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు