ఆంధ్రప్రదేశ్‌

సచివాలయానికి సకల వసతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 25: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి రహదార్లు, వౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ‘సచివాలయానికి దారేదీ’ అనే శీర్షికన ఆంధ్రభూమి ప్రధాన సంచికలో వెలువడిన వార్తాకథనంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాలకు వెళ్లే రహదారులు, సుందరీకరణ, కార్యాలయాల్లో ఫర్నీచర్‌తో పాటు ఇతర వౌలిక సదుపాయాలను పరిశీలించి ఏర్పాట్లు చేయాలని సీఆర్డీయే కమిషనర్ శ్రీకాంత్‌ను ఆదేశించారు. మరోవైపు జూన్ 27 నుంచి ఉద్యోగుల తరలింపు ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో సచివాలయంలో ఫర్నీచర్, ఏసి, మంచినీరు, విద్యుత్ సౌకర్యాల కల్పనకు రూ. 300 కోట్లు ఖర్చుకాగలవని అంచనావేశారు. కాగా రోడ్ల విస్తరణ, కొత్త రహదార్లకు సంబంధించి సీఆర్డీయే అధికారులు కసరత్తు జరిపారు. కొత్త రోడ్లకు డిజైన్లు రూపొందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న రహదార్ల విస్తరణలో సాధ్యాసాధ్యాలను సీఆర్డీయే కమిషనర్ శ్రీకాంత్, ఇతర అధికారులు పరిశీలించారు. తాత్కాలిక భవన సముదాయం, మందడం, వెంకటాయపాలెం గ్రామాల్లో చెత్తను తరలించేందుకు గ్రామం వెలుపల 200 మీటర్ల దూరంలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు మాస్టర్‌ప్లాన్‌లో నిర్దేశించిన స్థలాన్ని పరిశీలించారు. చెత్తను పునర్వినియోగించే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేపట్టనున్నారు. మందడం, వెంకటాయపాలెం ప్రాంతాల్లో అవసరమైన చోట్ల రహదార్ల విస్తరణ, ఇరువైపులా ఎల్‌ఈడి వీధిలైట్లు, గ్రీనరీపై సీఆర్డీయే కమిషనర్ సంబంధిత అధికారులతో చర్చించారు.

ఏపి సచివాలయానికి రహదారుల ఏర్పాట్లను అధికారులతో
కలిసి పరిశీలిస్తున్న సిఆర్డీయే కమిషనర్ శ్రీకాంత్