ఆంధ్రప్రదేశ్‌

‘పాము’ బినామీ డాక్టర్ బావమరిది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 9: అవినీతి అనకొండగా పేరొందిన పాము పాండు రంగారావును ఏసిబి వెంటాడుతోంది. అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో ఆయన బినామీలు బయటపడుతున్నారు. పాండురంగారావు అక్రమ సొమ్ముకు వారసులుగా ఉంటూ కోట్ల రూపాయలు పెట్టుబడులతో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. తాజాగా పాము బినామీ, అతని బావమరిదిని ఏసిబి అధికారులు సోమవారం విజయవాడలో అరెస్టు చేశారు. కోట్ల రూపాయల అక్రమార్జన కేసులో ఏపి పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరిగ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ పాము పాండు రంగారావు గతంలో అవినీతి కేసులో అరెస్టయి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో వందల కోట్ల రూపాయలు అక్రమాస్తులు ఏసిబి గుర్తించింది. అయితే పాముపై కొనసాగుతున్న దర్యాప్తులో ప్రధాన బినామీగా అతని బావమరిది డాక్టర్ నట్టా కృష్ణమూర్తి (58)ని గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో బేబి చిల్డ్రన్ హాస్పటల్స్ పేరుతో ప్రాక్టీసు చేస్తున్న కృష్ణమూర్తిని అరెస్టు చేసి ఏసిబి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండుకు తరలించారు. నిందితుడు కృష్ణమూర్తి తన బావ పాండురంగారావు అవినీతి వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. పాము అక్రమంగా ఆర్జించిన సొమ్మును కృష్ణమూర్తి పేరుతో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. అదేవిధంగా కృష్ణమూర్తి, ఆయన తల్లిదండ్రులు బేబి నాంచారమ్మ, ఎన్ రాజేశ్వరరావు పేర్లతో ఉన్న బ్యాంకు అకౌంట్లలో పాము పాండురంగారావు సంపాదించిన అక్రమ డబ్బు నిల్వలను కూడా అధికారులు గుర్తించారు. మొత్తం మీద కృష్ణాజిల్లా గంపలగూడెం, విశాఖపట్నం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, విజయవాడ గుణదల, లబ్బీపేట, మైలవరం తదితర చోట్ల పాము బినామీగా కృష్ణమూర్తి పేరుతో ఉన్న 11 ఖాళీ స్థలాలు, 23.43 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక ఫ్లాటు, ఒక ఇల్లు, మరొక జి ప్లస్ 2 భవనం గుర్తించారు. వీటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 87లక్షల 69వేల 220రూపాయలు ఉంటుంది. కాగా మార్కెట్ విలువ ప్రకారం కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.