ఆంధ్రప్రదేశ్‌

మండుతున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 26: ఎండలు మండుతున్నాయి. వాయువ్య దిశగా వస్తున్న వేడుగాలులతో వడగాల్పులు వీస్తున్నాయి. గురువారం కోస్తాలో సాధారణ స్థాయి కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాయలసీమలో మాత్రం రెండు డిగ్రీలు అధికంగా నమోదైంది. రాష్ట్రంలో మరో 24 గంటల పాటు వడగాల్పులు కొనసాగుతాయని విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు.
వడదెబ్బకు 11 మంది మృతి
ఉత్తరాంధ్ర జిల్లాల్లో శుక్రవారం 11 మంది మృతి చెందారు. విశాఖ జిల్లా గోవాడ ప్రాంతంలో ఏడువాడ అప్పలనాయుడు (45), గాంధీ గ్రామానికి చెందిన బంటు నూకన్న (70), చోడవరం దుడ్డు వీధికి చెందిన పాత్రోజి రాజేశ్వరి (80), అనంతగిరి మండలం చిలకలగెడ్డ పంచాయతీ దాసరితోటలో మతిస్థిమితం లేని మరో వ్యక్తి వడదెబ్బకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. చోడవరం మండలం కండిపల్లి గ్రామానికి ఉరమాల ఈశ్వరమ్మ (45), మాకవరపాలెం మండలం కొండల అగ్రహారానికి చెందిన పోలిరెడ్డి రాములమ్మ (70), రావికమతం మండలం మరుపాక గ్రామానికి చెందిన పసుపులేటి చిన్నమ్మ (55) వడదెబ్బతో గురువారం మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ప్రాంతంలో సరోజని అనే వృద్ధురాలు వడదెబ్బకు గురై మృతిచెందింది.