ఆంధ్రప్రదేశ్‌

చిత్తూరు జిల్లాలో కుంభవృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు/మదనపల్లె, అక్టోబర్ 9 : చితూరు జిల్లా మదనపల్లె, పులిచర్ల మండలాల్లో ఆదివారం రాత్రినుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పులిచర్ల మండలం భీమవరం మార్గంలో వంతెన కొట్టుకుపోయింది. పులిచెర్ల మండలంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన కుండపోత వర్షం పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. హంద్రీ-నీవా కాలువ నీరు పాళెం పంచాయతీ తుడుంవారిపల్లిని ముంచెత్తడంతో ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని రాత్రంతా జాగారం చేశారు. నిత్యావసర వస్తువులు నీటిపాలు కాగా, పలు కోళ్లు మృత్యువాత పడ్డాయి. వేకువఝామున జేసిబి సాయంతో హంద్రీ-నీవా కాలువకు మరో ప్రాంతంలో గండి కొట్టడంతో తుడుంవారిపల్లి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎల్లంకివారిపల్లి- భీమవరం మార్గంలో ఇటీవల నిర్మించిన వంతెన వర్షం ధాటికి ఒక వైపు కొట్టుకుపోవడంతో తిరుపతికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాయవారిపల్లి, ఎల్లంకివారిపల్లి, మంగళంపేట ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కమ్మపల్లి సమీపంలో చెక్‌డ్యామ్ కొట్టుకుపోవడంతో వ్యవసాయ పంటలు నీట మునిగాయి. మంగళంపేటలో రాత్రి ఉరుములతో కూడిన వర్షం కురుస్తుండగా రెండు కొబ్బరిచెట్లపై పిడుగులు పడ్డాయి ఆదివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని రామసముద్రం, పుంగనూరు, పలమనేరు మండలాల పరిధిలోని పలు చెరువులు నిండి వృథానీరు కిందికి పోతోంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మదనపల్లె పట్టణంలోని కోమటివానిచెరువు, తంబళ్లపల్లి మండల పరిధిలోని గుండ్లపల్లి చెండ్రాయునిచెరువు, పీలేరు మండలం మేళ్లపల్లి పంచాయతీ పరిధిలోని అత్తినాయునిచెరువు, కెవి పల్లి మండలం పరిధిలోని సొరకాయలపేట పంచాయతీ సిల్లులవారిపల్లి ప్రాంతంలోని కొత్తపల్లి చెరువులు పొంగుతున్నాయ.