రాష్ట్రీయం

2018 నాటికి పోలవరం మొదటి దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 19: పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే బడ్జెట్‌కు మించి 2 వేల కోట్ల రూపాయలు వెచ్చించి పనులు ప్రారంభించామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని దివంగత మల్లెల సత్యనారాయణ ప్రాంగణంలో జరుగుతున్న జాతీయస్థాయి ఎడ్ల బల ప్రదర్శన రెండవ రోజు కార్యక్రమానికి మంగళవారం ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన నివేదికను కేంద్రప్రభుత్వానికి పంపించామన్నారు. రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా నదులను అనుసంధానం చేస్తున్నామని, అందుకు పట్టిసీమే నిదర్శనమన్నారు. అలాగే 2018 నాటికల్లా పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పనులుపూర్తి చేస్తామన్నారు. గోదావరి, కృష్ణ, పెన్నా నదులను కూడా అనుసంధానం చేస్తున్నామన్నారు. పట్టిసీమ ద్వారా తొలుత కుడికాల్వకు నీరు అందించామని, రానున్న రోజుల్లో ఎడమకాల్వకు నీరు విడుదల చేసి విశాఖపట్నంకు నీరందిస్తామన్నారు. వినుకొండ ఫేజ్-1 పనులు పూర్తవుతున్నాయని, తద్వారా కడప, బద్వేల్ ప్రాంతాలకు నీటి సమస్య తీరుతుందన్నారు. వంశాధార, నాగావలి నదులను అనుసంధానం చేస్తామని ఉద్ఘాటించారు. 10 సంవత్సరాలు రాష్టమ్రంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ తోటపల్లి ప్రాజెక్టును పట్టించుకోలేదని, 11 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేశారన్నారు. నాగార్జునసాగర్‌లో నీరు వచ్చే సమయంలో గుండ్లకమ్మ ప్రాజెక్టుకు కూడా నీరు అందిస్తామన్నారు. ఈ సంవత్సరం 75 వేల ఎకరాలకు పట్టిసీమ ద్వారా నీరు అందించామని రానున్న సంవత్సరంలో లక్షా 50 వేల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి మోదీలు పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు దృష్టి సారించారన్నారు.