ఆంధ్రప్రదేశ్‌

పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 10: గుజరాత్ తరహాలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ సుంకాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేస్తూ రాష్ట్ర బిజెపి కార్యవర్గ సమావేశం తీర్మానించింది. మంగళవారం గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్‌లో జరిగిన ఈ సమావేశానికి ఏపి బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అధ్యక్షత వహించారు. మాజీ కేంద్రమంత్రులు దగ్గుబాటి పురంధ్రీశ్వరి, కావూరి సాంబశివరావు, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్, బిజెపి అఖిల భారత ఆర్గనైజింగ్ కార్యదర్శి సతీష్‌జీ, జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు, పలువురు పార్టీ ప్రముఖులు హాజరైన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ప్రభావం, పేదరిక నిర్మూలన, వెనుకబడిన తరగతులకు రాజ్యాంగ హక్కుల పట్ల నిబద్ధత, ఒబిసి కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర పార్టీలో చర్చించారు. వచ్చే ఐదేళ్లలో వ్యవసాయాన్ని సుసంపన్నంచేసి రైతులకు రెట్టింపు ఆదాయం తీసుకువచ్చే విధంగా కేంద్రప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని, ఈ అంశంపై విస్తృత ప్రచారం చేయాలని నేతలు సూచించారు. రాష్ట్రంలో వౌలిక సదుపాయాల కల్పన, జల రవాణా, రాజధాని నిర్మాణానికి కేంద్ర ఆర్థిక సాయంపై విశే్లషించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణకు రూ. లక్ష కోట్ల నిధులు మంజూరు చేయటం పట్ల సమావేశం హర్షం వ్యక్తంచేసింది. తీవ్రవాదం, వేర్పాటు వాద ఉద్యమాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని పార్టీ సమర్థించింది. కేరళలో వామపక్ష అతివాదశక్తులు గత 16 నెలల్లో 14 మంది పార్టీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తూ ఈనెల 17వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. జిఎస్‌టి వల్ల ఉత్పన్నమైన సమస్యలను అధిగమించేందుకు కేంద్రం చేపట్టిన విధానాలపై విస్తృత ప్రచారం చేయాలని, చైనా సరిహద్దుల్లో డోక్లాం వివాదాన్ని శాంతియుత మార్గంలో పరిష్కరించటం, వైద్యపరికరాల ధరల తగ్గింపు, రామ్‌నాథ్ కోవింద్, వెంకయ్యనాయుడులకు రాష్టప్రతి, ఉపరాష్టప్రతి పదవులకు ఎంపికవటం పట్ల సమావేశం హర్షం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ కేంద్రం రూ. 2.75 పైసల మేర పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిందని, దీనికి తోడు రాష్ట్రాల్లో వ్యాట్‌ను ఎత్తివేస్తే మరింత ప్రయోజనం చేకూరగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. బిజెపి పాలిత రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్టల్రో వ్యాట్ తగ్గింపు వల్ల మూడు రూపాయల మేర వినియోగదారులు లబ్ధి పొందారని, ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో వ్యాట్ ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. త్వరలో జిల్లాల వారీగా పార్టీ కమిటీలు పూర్తిచేసి అనుబంధ సంఘాలపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్, ఏపిఎంఐడిసి చైర్మన్ ఆర్ లక్ష్మీపతి, జూపూడి రంగరాజు, గుంటూరు అర్బన్ పార్టీ కన్వీనర్ అమ్మిశెట్టి ఆంజనేయులు, వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.