ఆంధ్రప్రదేశ్‌

విలువలతో కూడిన వార్తలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 10: మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను మేళవించి మెరుగైన సమాజం కోసం పాత్రికేయులు విలువలతో కూడిన సమాచారాన్ని సమాజానికి అందించేందుకు నిరంతరం కృషి చేయాలని సమాచార పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపు ఇచ్చారు. మంగళవారం స్థానిక మొగల్రాజపురం రెవిన్యూ కాలనీలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ కార్యాలయాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు సారధ్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తారన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అనుభవం పత్రికల్లో పనిచేసే పాత్రికేయులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలియజేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ అమరావతికి అనుకున్న సమయానికి రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి, పట్టుదల ఉందన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు మాట్లాడుతూ ఆంధ్రా గడ్డ మీద ప్రెస్ అకాడమీ సేవలు ప్రారంభించడం గర్వంగా ఉందని, మంత్రి కాలవ శ్రీనివాసులు, కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్, సీనియర్ పాత్రికేయులు రాఘవాచారి, తుర్లపాటి కుటుంబరావును ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు, సెక్రటరీ డి.శ్రీనివాస్‌లు ఘనంగా సత్కరించారు. పాత్రికేయ సంఘాల ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రెస్ అకాడమీ ఉద్యోగులు పాల్గొన్నారు.

చిత్రం.. ప్రెస్ అకాడమీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి కాలవ, అకాడమీ చైర్మన్ దీక్షితులు