ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు పటిష్ఠ చర్యలు: గంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 10: ఇటీవల తరచుగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను నివారించే అంశంపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నతాధికారులతో మంగళవారం సుదీర్ఘంగా చర్చించారు. ఇంటర్మీడియట్ కమిషనర్ బి.ఉదయలక్ష్మితోపాటు ఉన్నతాధికారులతో వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఉదయం ఆయన సమావేశమయ్యారు. తరచూ విద్యార్థులు ఆత్మహత్యల ఘటనలు జరుగుతుండటం చాలా బాధిస్తోందని, దీనికి అడ్డుకట్ట వేయాలన్నారు. విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై గతంలో చక్రపాణి కమిటీ చేసిన సిఫార్స్‌ల అమలుపైనా చర్చించారు. వీటికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా ఇచ్చినప్పటికీ కళాశాలల యాజమాన్యాలు అవి సరిగా పాటించడం లేదన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కళాశాల యాజమాన్యాలతో ఈనెల 16న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో కళాశాలల యాజమాన్యాలకు మంత్రి గంటా స్పష్టమైన ఆదేశాలను ఇవ్వనున్నారు. ఒత్తిడి లేని విద్యను అందించడం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు, మానసిక హెల్త్‌చెకప్‌లు, కౌన్సిలింగ్, తదితర అంశాలు కళాశాలలు తప్పనిసరిగా పాటించాలని చక్రపాణి కమిటీ సిఫార్స్‌లు చేసింది. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా తరచూ తరగతులు మార్చడం, విద్యార్థుల మార్కులు నోటీసు బోర్డులో ఉంచడం వంటి అంశాలు విద్యార్థుల న్యూనతా భావానికి లోనయ్యేలా చేస్తున్నాయని కమిటీ తెలిపింది. వీటికి అడ్డుకట్ట వేసేలా గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టే అంశంపైనా మంత్రి గంటా చర్చించారు. ఏది ఏమైనప్పటికీ విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ఆ దిశగా అధికారులు సన్నద్ధం కావాలని మంత్రి స్పష్టం చేశారు. చక్రపాణి కమిటీ సిఫార్స్‌ల అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్లు మంత్రి గంటా తెలిపారు.