ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ పాలనలో భద్రతకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 10: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అడ్డుపెట్టుకుని ఉల్లంఘనలు, అక్రమాలకు పాల్పడేందుకు ఏ మాత్రం వీలు కాని విధంగా అందుబాటులోకి వచ్చిన బ్లాక్‌చైన్ సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పాటు విశాఖలో జరిగిన బ్లాక్‌చైన్ బిజినెస్ కాన్ఫరెన్స్ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలనలో అత్యాధునిక బ్లాక్‌చైన్ సాంకేతికతను అందిపుచ్చుకునే పలు అంశాల్లో కీలక అవగాహన కుదిరింది. ముఖ్యంగా రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల్లో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా పారదర్శకతతో పాటు అవకతవలకు ఆస్కారం లేకుండా చూడవచ్చని నిర్ధారించారు. రాష్ట్రంలో భూ రికార్డుల నమోదు, భూ రిజిస్ట్రేషన్లు వంటి అంశాల్లో విశ్వసనీయతను పెంచడంతో పాటు భద్రతకు ప్రాధాన్యతనిచ్చేందుకు ప్రభుత్వం క్రోమావే సంస్థతో అవగాహనకు వచ్చింది. భూ వివరాల నమోదు, డేటా నిక్షిప్తం వంటి అంశాల్లో ఈ విధానం వల్ల అక్రమాలకు తావుండదు. సురక్షితమైన భూ రికార్డుల నమోదు, రిజిస్ట్రేషన్లు, భూ యాజమాన్య వివరాలు నమోద చేసేలా క్రోమావే బ్లాక్‌చైన్ వంటి శక్తివంతమైన విధానాన్ని అవలంభించనుంది. దీనిపై క్రోమావే సిఇఓ హెన్రిక్ హెల్టే సదస్సులో భాగంగా తమ ప్రణాళికను వివరించారు. సంద్రదాయ రుణ విధానంలో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా రుబిక్స్ సంస్థ తమ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. ఆర్థిక రంగాన్ని డిజిటలైజ్ చేయడం ద్వారా గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టనుంది.