ఆంధ్రప్రదేశ్‌

కర్నూలును ముంచిన వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 10: జడివాన కర్నూలు జిల్లాను ముంచింది. మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి జిల్లాలోని పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కర్నూలు నగరంలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో మంగళవారం సగటున 35.5 మి.మీ వర్షపాతం నమోదైంది. వాగులు పొంగడంతో మంత్రాలయం నుంచి కర్నాటకకు, నందికొట్కూరు నుంచి నంద్యాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కర్నూలు నగరంలో హంద్రీ నది వెంట ఉన్న కాలనీల్లోకి వర్షం నీరు చేరింది. గాజులదినె్న ప్రాజెక్టు నిండడంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని కొత్తబస్టాండ్‌కు వెళ్లే దారిలోని అండర్ బ్రిడ్జి నీట మునిగింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దకడుబూరు మండలంలో సుమారు 200 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మంత్రాలయంలో 18 ఇళ్లు దెబ్బతిన్నాయి.