ఆంధ్రప్రదేశ్‌

ఎక్కడవేసిన గొంగళి అక్కడే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 10: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో విపరీతమైన జాప్యం నెలకొంది. ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఈ పథకాన్ని జలసిరికి హారతిలో జాతికి అంకితంచేశారు. ఆ తర్వాత పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారయ్యాయి. రెండు పైపులైన్లతో నీటిని విడుదల చేయడంతోనే పనులు పరిమితమయ్యాయి. పైపులైన్లు నేలలో కూరుకుపోవడం, పేలిపోవడం వంటి బాలారిష్టాల నుంచి మొదటి రెండు పైపులైన్ల పనుల్లోనే జాప్యం నెలకొంది. రెండు పంపుల ద్వారా నీటిని తోడి ఒక వరస పైపులైన్ పూర్తిచేసి గండికోట వద్ద డిశ్చార్జి పాయింట్‌కు నీటిని చేర్చడానికే ముఖ్యమంత్రి ప్రారంభించిన తర్వాత దాదాపు నెల రోజులు పట్టింది. ఇప్పటికొచ్చి బిహెచ్‌ఇఎల్ నుంచి పురుషోత్తపట్నం కోసం తయారుచేసిన పంపులు రాలేదు. నేటికీ హంద్రీ నీవా పథకం నుంచి తెచ్చిన అరువు పంపులతోనే పురుషోత్తపట్నం నెట్టుకొస్తోంది. హెడ్ వర్క్సు నిర్మాణ పనుల్లో పురోగతి కన్పించడం లేదు. ఒకవైపు పంపులు రాలేదు, మరోవైపు పైపులైన్ల పనులు జరగడం లేదు, ఇంకోవైపు క్రాసింగ్ పనులు పూర్తికాలేదు. ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించి ఇప్పటికి దాదాపు రెండు నెలలు కావస్తోంది.. నేటికీ అంగుళం పురోగతి కన్పించడం లేదు. ఈలోపు ఏలేరుకు నీటి సరఫరా గడువు కూడా పూర్తయిపోతోంది. మొదటి ఖరీఫ్‌కు ఏలేరు అనుసంధానం అసంపూర్తిగానే జరిగిందని చెప్పొచ్చు. పురుషోత్తపట్నం మార్గదర్శకాల ప్రకారం ఏలేరుకు నీటిని తోడే అవకాశం డిసెంబర్ వరకు మాత్రమేవుంది. ఈ గడువు కాస్తా ముంచుకొస్తోంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఏలేరుకు నీటిని సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ రహదారి క్రాసింగ్‌లు పూర్తి కాకపోవడంవల్ల నేటికీ పుష్కర కాలువ ద్వారానే నీటి సరఫరా జరుగుతోంది. ఇదిలావుండగా పురుషోత్తపట్నం పథకం నుంచి ఒకవైపు ఏలేరు ఆయకట్టు స్థిరీకరణ, మరోవైపు విశాఖకు అవసరం మేరకు నీటిని అందించాలని ఆశించారు. కానీ విశాఖపట్నానికి నీటిని తీసుకెళ్ళే ఏలేరు ఎడమ కాల్వ పూర్తిగా పూడుకుపోయింది. రోజుకు 350 క్యూసెక్కుల నీటిని తోడి పురుషోత్తపట్నం నుంచి ఏలేరులోకి పోసినా ఆ నీటిని ఏలేరు ఎడమ కాల్వ నుంచి విశాఖ తీసుకెళ్ళడం కనాకష్టమే. ఎందుకంటే ఈ కాల్వ పూర్తిగా పూడికవల్ల 250 క్యూసెక్కుల నీటిని తప్ప విశాఖకు తీసుకెళ్ళలేని స్థితి కన్పిస్తోంది. దీనితో ఏలేరు ఆయకట్టు స్థిరీకరణకు పరిమిమయ్యే పరిస్థితి కన్పిస్తోంది. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా విశాఖకు లక్ష్యం మేరకు నీటిని తీసుకెళ్ళేందుకు అవకాశం కలుగుతుంది. గోదావరి వద్ద 14 మీటర్ల నుంచి 30 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్లి పోలవరం కాల్వలో పోయాల్సివుంది. దీనికి మోటార్ల సామర్ధ్యం కూడా మరీ ఎక్కువ అవసరం లేదు. కానీ పోలవరం కాల్వ నుంచి నీటిని ఏలేరులోకి ఎత్తిపోసేందుకు మాత్రం మోటార్ల సామర్ధ్యం అధికంగా ఉండాల్సివుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోపు ప్రత్యామ్నాయంగా నిర్మిస్తున్న పురుషోత్తపట్నం వల్ల విశాఖకు నీరందించే పరిస్థితి కనపడటం లేదు.