ఆంధ్రప్రదేశ్‌

‘హోదా’పై మడం తిప్పిన జగన్: కంభంపాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 11: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనపై ప్రతిపక్ష నేత జగన్ వెనక్కు తగ్గారని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు ఆరోపించారు. వెలగపూడి సచివాలయంలో అసెంబ్లీ ఆవరణలోని టిడిఎల్‌పి కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ హోదా సాధన కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ఆయన మూడోసారి తాజాగా చెప్పారని ఎద్దేవా చేశారు. దాదాపు మరో సంవత్సరంలో ఎన్నికలు వస్తున్న తరుణంలో ఎంపీలతో రాజీనామాను చివరి అస్త్రంగా ప్రయోగిస్తానంటూ చెబుతున్నారని, ఆ టైమ్ ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రానికి హోదా ఇస్తే, స్వాగతిస్తామని, హోదా సాధ్యం కాదని తెలిశాక, ఆ వంకతో నిధుల రాకను అడ్డుకోకూడదని భావించి ప్యాకేజీకి అంగీకరించామని స్పష్టం చేశారు. హోదా వల్ల అదనపు లాభం మాత్రమే ఉంటుందన్నారు. ప్రతిపక్ష నేత యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

2019లోనూ మాదే అధికారం: యనమల
విజయవాడ (క్రైం), అక్టోబర్ 11: తెలుగుదేశం, బిజెపి కాపురాన్ని చెడగొట్టాలనే దురుద్దేశ్యంతో ప్రతిపక్ష నేత జగన్ వ్యవహరిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యంగంగా అన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా జగన్ ముఖ్యమంత్రి కాలేడని, 2019 ఎన్నికల్లోనూ తమదే విజయమన్నారు. జగన్ క్యారెక్టర్ లేని వ్యక్తని, స్పెషల్ స్టేటస్‌కి, ప్యాకేజీకి తేడా తెలీదన్నారు. విజయవాడలో బుధవారం జరిగిన కృష్ణాజిల్లా నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన యనమల మాట్లాడుతూ ప్రతిపక్ష నేతపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. జగన్, ఆయన పరివారం జైలుపక్షులని, చెట్టు కింద కూర్చొని ఇంకా ఎలాంటి అవినీతి కార్యకలాపాలు చేయాలని చర్చిస్తుంటారని ఎద్దేవా చేశారు. కేంద్రంతో రాష్ట్రానికి సత్సంబంధాలు ఉన్నాయని, వాటిని పాడుచేయాలని, కలిసి కాపురం చేసుకుంటున్న బిజెపి, తెలుగుదేశం మధ్య చిచ్చు పెట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. దేశంలో జిఎస్‌టి పన్ను మినహాయింపు ఏ రాష్ట్రానికీ లేదని, జగన్ అవగాహన లేమితో తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. స్పెషల్ స్టేటస్ కన్నా, ప్యాకేజీ ప్రకారం కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తోందని చెప్పారు. ఇందులో భాగంగానే పోలవరం పనులు చకచకా సాగుతున్నాయన్నారు.

ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర: సోమిరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 11: అవినీతి ఆరోపణలు, అభివృద్ధి అడ్డుకునే ఆలోచనల నేపథ్యంలో పాదయాత్రకు ఎలా వెళ్తారని ప్రతిపక్ష నేత జగన్‌పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాదయాత్ర వెనుక ఉన్న అజెండా ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని విద్యార్థులు ఏవిధంగా ఆదర్శంగా తీసుకోవాలో చెప్పాలన్నారు. ప్రతిపక్ష పాత్ర సరిగాలేదని, పిల్లలు చెడిపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు హైదరాబాద్ మాదిరిగా మారాయా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి గరిష్ఠ సాయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశంలో ఎపిలో నాలుగు శాతం జనాభా ఉన్నా, 11 శాతం మేర ఉపాధి నిధులు రాబట్టుకుంటున్నామని గుర్తు చేశారు. కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. హోదా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పాకే, ప్యాకేజీకి అంగీకరించామని గుర్తు చేశారు. ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగితే, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చని, కానీ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం తీరు సరిగా లేదన్నారు.