ఆంధ్రప్రదేశ్‌

సాధికారతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజధాని అభివృద్ధికి సమాంతరంగా వృద్ధి 32 వేల కుటుంబాల ఆర్థిక సమున్నతికి కృషి
సింగపూర్ పర్యటనకు 123మంది రైతుల ఎంపిక సిఆర్‌డిఎకు సిఎం చంద్రబాబు లక్ష్య నిర్దేశం

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
అమరావతి, అక్టోబర్ 11: రాజధాని కోసం భూములిచ్చిన రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న తన ఆలోచనను సాకారం చేయడానికి అవసరమైన కార్యచరణ ప్రణాళిక వచ్చే సమావేశానికి సిద్ధం చేయాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించేందుకు 123మంది రాజధాని ప్రాంత రైతులను సింగపూర్ తీసుకువెళ్లాలన్న ప్రతిపాదనకు బుధవారం జరిగిన 12వ సిఆర్‌డిఎ ప్రాధికార సమావేశంలో ఆమోదం తెలిపారు. రాజధాని గ్రామాల్లోని రైతులే అమరావతికి అసలు పౌరులు. వారి ఉన్నతికి దోహదపడే కృషిని తక్షణమే చేపట్టాలని సిఎం అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే తొలుత వారిని సింగపూర్ పంపిస్తున్నామని చెప్పారు. సింగపూర్‌లో ఉన్న ఉత్తమ అభ్యాసాలు, అవకాశాలపై అవగాహన పెంచి వ్యాపార, వాణిజ్య రంగాల్లో వారిని ప్రావీణ్యులను చేయాలన్నదే యాత్ర ఉద్దేశమని వివరించారు. సింగపూర్ తీసుకువెళ్ళేందుకు జరిపిన ఎంపిక ప్రక్రియలో మొత్తం 123మంది రైతులు అర్హత సాధించగా, లాటరీ తీసి అందులో వందమందిని ఎంపిక చేశామని సిఆర్‌డిఎ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ చెప్పారు. మిగిలిన ఆ 23మంది రైతులను నిరుత్సాహపర్చకుండా వారినీ సింగపూర్ తీసుకువెళ్లాలన్న ప్రతిపాదనతో మరో రూ.12 లక్షల అదనపు బడ్జెట్ కేటాయింపు అంశాన్ని సమావేశం అజెండాలో చేర్చగా, సిఎం దానికి వెంటనే ఆమోదం తెలిపారు. ‘రాజధాని గ్రామాల్లోని రైతులు కష్టజీవులు. మూడేళ్ల క్రితం వరకు వారంతా వ్యవసాయానే్న నమ్ముకుని జీవించారు. నా మాట నమ్మి విలువైన భూములను ప్రభుత్వానికి అందించారు. వారంతా సంతోషంగా ఉండేలా చూడాలి. సంతృప్తిగా జీవించాలి. వారందరినీ పారిశ్రామికవేత్తలుగా మార్చాలి. అందుకు గల అన్ని అవకాశాలనూ అందుబాటులో తీసుకురావాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘్ఫర్మర్స్ ఫస్ట్’ అనే భావనతో ఈ యాత్ర తలపెట్టామని సిఆర్‌డిఎ కమిషనర్ చెప్పగా, ‘సాధికారత దిశగా రాజధాని రైతు’ యాత్రగా మార్చాలని సిఎం సూచించారు. రాజధాని రైతులు వ్యవసాయం నుంచి వాణిజ్య, పారిశ్రామికరంగం వైపు మరలే ప్రక్రియ వీలైనంత వేగంగా, సరళంగా జరిగిపోవాలన్నారు. అమరావతి గ్రామాల్లోని 32 వేల కుటుంబాలు ఆర్థికంగా బలపడేలా, సమున్నతంగా ఎదిగేలా నిర్ణిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సిఆర్‌డిఎకు సూచించారు. ‘రాజధాని అభివృద్ధికి సమాంతరంగా రాజధాని రైతుల అభివృద్ధి కూడా జరగాలి. దీనిపై రానున్న సమావేశంలో నిర్దిష్ట ప్రతిపాదనలతో రావాలి’ అని బాబు ఆదేశించారు. రాజధాని గ్రామాల్లోని వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికుల సమగ్ర వివరాలను సేకరించాలని చెప్పారు. ప్రతి ఒక్కరి విద్యార్హతలు, కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్థితిగతులపై తాజా సమాచారం తీసుకోవాలన్నారు. వారిని చిన్నచిన్న బృందాలుగా ఏర్పరచి నైపుణ్య శిక్షణ, వ్యాపార అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుపై సరైన అవగాహన కల్పించాలని, ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకన్జీకి ఈ బాధ్యతలు అప్పగించి తగిన ప్రణాళికను రూపొందించాలని చెప్పారు.