ఆంధ్రప్రదేశ్‌

24 రోజుల్లో 25 కోట్ల మొక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 11: హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వనం-మనం కార్యక్రమం మరో 24 రోజుల్లో ముగియనున్నందున ప్రభుత్వం నిర్దేశించిన 25 కోట్ల మొక్కలు నాటే కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయవలసిందిగా అటవీశాఖ అధికారులను మంత్రి శిద్దా రాఘవరావు ఆదేశించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో అటవీశాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2029 నాటికల్లా రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధించేందుకు అటవీశాఖ ప్రణాళికలను, విధి విధానాలను రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా రాష్టవ్య్రాప్తంగా వివిధ శాఖల సహకారంతో 21.04 కోట్ల మొక్కలు నాటినట్లు తెలియజేశారు. వనం-మనంలో భాగంగా ప్రతి శనివారం విద్యార్థులకు ‘ప్రకృతి పిలుస్తోంది’ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఇప్పటివరకు రాష్టవ్య్రాప్తంగా 7327 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో 4,90,933 మంది విద్యార్థులు, ప్రజలు పాల్గొని 1,01,96,195 మొక్కలు నాటారని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించడానికి, జనవాసాల్లోకి ఏనుగులు, వన్యప్రాణులు రాకుండా నిరోధించడానికి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా చుట్టూ వేల కిలో మీటర్లలో ఫారెస్ట్ పెరిపెరల్ ట్రెంచ్ (కందకాలు), కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు మేరకు ఈ ట్రెంచ్‌స్‌ను ఏర్పాటు చేయడానికి 500 కోట్ల రూపాయల ప్రతిపాదనలను వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్‌కి, ఆర్థికశాఖకు పంపించామని, అనుమతులు రాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. వీటి వల్ల అటవీ ప్రాంతాల్లో భూగర్భజల మట్టాలు పెరిగి అటవీ ప్రాంతంలో పచ్చదనం పెరుగుతుందన్నారు. గుంటూరు లేదా నెల్లూరులో నవంబర్ 4వ తేదీన నిర్వహించే వనం-మనం ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొంటారని మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు.

ట్రిపుల్ ఐటి విద్యార్థి ఆత్మహత్య
నూజివీడు, అక్టోబర్ 11: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటిలో చదువుతున్న విద్యార్థి బుధవారం రాత్రి 10.30 సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం శంకరగుప్పం గ్రామానికి చెందిన సాగిరెడ్డి లక్ష్మీనరసింహ మూర్తి (16)కి శ్రీకాకుళం త్రిబుల్ ఐటిలో సీట్ వచ్చింది. శ్రీకాకుళం త్రిబుల్ ఐటి తరగతులు నూజివీడులో జరుగుతున్నాయి. ఆగస్టు చివరి వారంలో అడ్మిషన్ పొందిన మూర్తి బుధవారం రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. నాలుగు రోజుల నుండి డల్‌గా ఉంటున్నాడని తోటి విద్యార్థులు తెలిపారు. విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు తెలియాల్సింది.