ఆంధ్రప్రదేశ్‌

నర్సరీ పనుల్లో మహిళలకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 11: ఉపాధి హామీ పనులకు సంబంధించి నర్సరీ పనుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. అటవీ శాఖతో ఉపాధి పనుల అనుసంధానం, ఉపాధి హామీ పథకం అమలు తీరుపై బుధవారం ఆయన వెలగపూడి సచివాలయంలో సమీక్షించారు. మహిళలకు నర్సరీ పనులు సులువుగా ఉంటాయని, వారికి ప్రాధాన్యత ఆ పనుల్లో ఇవ్వాలన్నారు. వేతన బకాయిల సంగతి అటవీ శాఖ అధికారులు ప్రస్తావించగా, ఈ నెలాఖరులోగా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఫిష్ పాండ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. హార్టికల్చర్, హౌసింగ్, స్ర్తిశిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖలో ఉపాధి హామీ పనుల అనుసంధానంపై ఆయా శాఖల మంత్రులతో చర్చించారు. మినీ స్టేడియం నిర్మాణంలో అనుకున్న వేగం కనిపించడం లేదన్నారు. అనంతరం విఎం వేర్ సాఫ్ట్‌వేర్ సంస్థతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో మంత్రులు శిద్దా రాఘవరావు, పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి, పంచాయితీరాజ్ కమిషనర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
వర్మ సినిమాపై చర్చించాలా?
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై చర్చించాల్సిన అవసరం లేదని బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు సంబంధించి ఎవరైనా సినిమా తీయవచ్చని, కానీ ఒక కోణంలో కాకుండా సమగ్రంగా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు