ఆంధ్రప్రదేశ్‌

రుచిగా, శుచిగా భక్తులకు అన్నప్రసాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 12: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం కోసం వస్తున్న లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు అందిస్తున్నామని టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలందిస్తున్న అన్నప్రసాద విభా గం అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం జరిగిన ఆయుధ పూజలో పాల్గొ న్న అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం దీపావళి, దసరా పర్వదినాల మధ్య అన్నప్రసాద భవనంలో ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇక్కడి వంట సామగ్రికి, వంటపాత్రలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి సంవత్సరమంతా నిర్విఘ్నంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలతోపాటు, తాగునీరు, మజ్జిగ అందిస్తున్నట్లు చెప్పారు. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఇప్పటివరకు దాదాపు రూ.850 కోట్లను భక్తులు విరాళంగా అందించారని ఇఓ వివరించారు. అన్నప్రసాదాల తయారీకి ఏడాదికి రూ. 90 కోట్లు ఖర్చు అవుతోందన్నారు. ఇందులో డిపాజిట్లపై వస్తున్న వడ్డీ రూ. 60 కోట్లు కాగా, రూ. 30 కోట్లను టిటిడి ఫండ్‌గా అందిస్తోందని తెలిపారు. భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించగా అన్నప్రసాద వితరణపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. కొందరు భక్తులు ఇచ్చిన సూచనల మేరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్నప్రసాదాల్లో మార్పులు చేశామని, వృథాకాకుండా చర్యలు తీసుకున్నామని, చంటి పిల్లలకు ఇబ్బందులు లేకుండా పాలు అందిస్తున్నామని వివరించారు. ఆయుధ పూజ అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాద వితరణ ఏర్పాట్లను పరిశీలించారు. వంట సామగ్రిని, వంట పాత్రలను, కోల్డ్ స్టోరేజీని, బియ్యం, కూరగాయలు తరగడం, వంట తయారీ విధానాన్ని పరిశీలించారు. వంటల తయారీ సిబ్బంది, శ్రీవారి సేవకులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యత తదితర విషయాలపై పలువురు భక్తులను ప్రశించగా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో టిటిడి విజిఓ రవీంద్రారెడ్డి, అన్నప్రసాద విభాగం డిప్యూటి ఇఓ వేణుగోపాల్, క్యాటరింగ్ అధికారి జిఎల్‌ఎన్ శాస్ర్తీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ భవనంలో ఆయుధ పూజ నిర్వహిస్తున్న దృశ్యం