ఆంధ్రప్రదేశ్‌

చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, మే 26: ప్రమాదవశాత్తూ చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చిన ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్‌లో గురువారం జరిగింది. ముగ్గురు పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. పోలీసుల కథనం ప్రకారం తెనాలిలోని ఐతానగర్‌కు చెందిన గంజి వెంకటేశ్వర్లు, లీలావతికి చెందిన కవల పిల్లలు లావణ్య (5), కుశాలు(5), తన్నీరు సోమయ్యి, సునీత కుమారుడు గోపీచందు(6) కలిసి గోపీచందు నాయనమ్మ బుల్లెమ్మాయిని తీసుకుని వారి ఇళ్లకు సమీపంలోని చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్ళారు. కొద్దిసేపటి తర్వాత వృద్ధులాలైన ఆమె మనవడు, మనుమరాళ్ళ కోసం కేకలు వేయగా వారి నుండి ఎటువంటి సమాధానం రాకపోవటంతో ఇంటికి వెళ్ళారని భావించింది. పిల్లల కోసం చెరువు కట్ట నుండి ఇంటికి వెళ్ళి ఆరాతీయగా చెరువు వద్దకు వెళ్ళిన పిల్లలు తిరిగి రాలేదని తెలుసుకుని చెరువు వద్దకే వెళ్ళి వెతుకుతుండగా ముగ్గురు పిల్లలు చెరువులో పడి మృతి చెంది నీటిపై తేలియాడుతూ కనిపించటంతో బుల్లెమ్మాయి పెద్దగా కేకలు వేసింది. దీంతో సమీపంలోని వారు హడావిడిగా చెరువు వద్దకు చేరుకున్నారు. అప్పటికే పిల్లలు మృతి చెంది ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తెనాలి ఆర్డీఓ జి నరసింహులు, డిఎస్పీ రమణకుమార్, మున్సిపల్ కమిషనర్ కె శకుంతల, టూటౌన్ సిఐ కళ్యాణ్‌రాజ్ తదితరులు చెరువు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సంఘటనపై విచారణ జరిపి ప్రాథమిక సమాచారం సేకరించారు. మృతి చెందిన ఇద్దరు కవల ఆడపిల్లలు వృద్ధురాలు బుల్లెమ్మాయి కుమార్తె పిల్లలుగా, గోపీచంద్ ఆమె కొడుకు కుమారుడిగా అధికారులు గుర్తించారు. వారంతా ఒకే కుటుంబంగా పక్కపక్కనే ఉంటూ కూలీనాలీ చేసుకుని జీవనం సాగించేవారుగా తెలుసుకున్నారు. చెరువు నుండి ముగ్గురు పిల్లల మృతదేహాలను బయటకు తీయించి శవ పంచనామా నిర్వహించిన అనంతరం తెనాలి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కళ్యాణ్‌రాజ్ తెలిపారు.