ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ పథకాలను అందరికీ చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాపట్ల, అక్టోబర్ 13: ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకాల లబ్ధిని కింది స్థాయి వరకు తీసుకెళ్లేక్రమంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర స్ర్తి, శిశుసంక్షేమ శాఖామాత్యులు పరిటాల సునీత సూచించారు. శుక్రవారం బాపట్లలో పర్యటించిన మంత్రి పరిటాల సునీత మునిసిపల్ కౌన్సిల్ హాలు ఆవరణలో స్ర్తి, శిశుసంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్న అమృత హస్తం పథకం ద్వారా గర్భిణిలకు, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తున్న సిడిపిఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాలను కల్పించాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. నిరంతరం పర్యవేక్షించాల్సిన సిడిపిఓలు, అంగన్‌వాడీ సిబ్బంది విధులను సక్రమంగా నిర్వర్తించాల్సిందిగా సూచించారు. జిల్లాలో 150 గ్రూపులకు చంద్రన్న పసుపు, కుంకుమ ద్వారా బ్యాంకు ఖాతాలో జమకాని మొత్తం గురించి అధికారులను ప్రశ్నించారు. గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెనిరిక్ మందుల షాపుల గురించి తెలియజేసి, తక్కువ రేటులో అందిస్తున్న మందులను వారు వినియోగించుకునేలా ప్రోత్సహించాలన్నారు. స్ర్తినిధి ద్వారా ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల ఆదాయం కల్పించేలా రుణాలను మంజూరు చేస్తున్నట్లు వివరించారు.
బాపట్ల పట్టణం నుండి సూర్యలంక వరకు రూ.8కోట్ల వ్యయంతో నిర్మించిన బిటి రోడ్డును మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్‌తో కలసి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న గడియారస్తంభం నిర్మాణాన్ని పరిశీలించారు. అక్కడే నిర్మించనున్న జెనిరిక్ మందుల షాపు స్థలాన్ని పరిశీలించారు. తదుపరి ఏరియా వైద్యశాలను సందర్శించి రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా ముందుగా బాపట్ల వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం డ్వాక్రా గ్రూపులకు రూ.4కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. తదుపరి పట్టణంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు.