ఆంధ్రప్రదేశ్‌

విపత్తుల నివారణకు రూ. 2,200 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, అక్టోబర్ 13: జాతీయ విపత్తుల నివారణ చర్యలకు ప్రపంచబ్యాంకు ద్వారా 2,200 కోట్ల రూపాయలు వినియోగించనున్నట్టు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక ప్రధానకార్యదర్శి డాక్టర్ మన్‌మోహన్‌సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని ఆ శాఖ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ విపత్తుల నివారణా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ జాతీయ తుఫాన్ విపత్తు నివారణ పథకం కింద 1340 కోట్లరూపాయలు వినియోగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 220 తుఫాన్ భవనాలు నిర్మించనున్నట్టు తెలిపారు. విపత్తులు ఎలా, ఎప్పుడు వస్తాయో తెలియవని, వాటి ప్రమాదస్థాయిని తగ్గించటానికి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. దేశంలోనే మొదటిసారిగా 40 నిముషాలు మందుగానే పిడుగుపాటు సమాచారాన్ని అందించగలుగుతున్నామన్నారు. విపత్తుల సమయంలో విద్యార్థులు, కమ్యూనిటీస్, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారం అందించాలన్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ ఎంవి శేషగిరిబాబు మాట్లాడుతూ విపత్తుల నిర్వహణలో సాంకేతికతలను వివరించారు. ఈమేరకు సెల్ బ్రాడ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు.