ఆంధ్రప్రదేశ్‌

ఎస్సీ కార్పొరేషన్ బడ్జెట్ రూ.2713 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: ఈ ఏడాది ఏపి ఎస్సీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ బడ్జెట్ రూ.2713 కోట్లకు పెరిగిందని కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు చెప్పారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితుల జీవన విధానంలో మార్పు కోసం, వారు ప్రారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి పలు పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రాబోయే తరాల భవిష్యత్ కోసం రోడ్ మ్యాప్ రూపొందించినట్లు చెప్పారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వారి రేషన్ రవాణాకు ఉపయోగించే విధంగా 175 వాహనాలకు రుణాలు అందజేయనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను వినియోగించే విధంగా రూ.1.50 లక్షల విలువైన బ్యాటరీ ఆపరేషన్ ట్రక్కులు 5వేలు అందజేయనున్నట్లు తెలిపారు. డ్రోన్ కెమెరాల కొనుగోలుకు కూడా రుణాలు ఇస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులకు వినియోగించడానికి 500 ట్రాక్టర్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్లు చెప్పారు. వాటి ఈఎంఐ పంచాయతీరాజ్ శాఖ చెల్లిస్తుందని చెప్పారు. భూమి కొనుగోలు పథకం ద్వారా ప్రభుత్వం రూ.2వేల కోట్లతో 4వేల ఎకరాల భూమి కొనుగోలు చేసి దళితులకు అందజేస్తుందని చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ఆత్మగౌరవ నినాదంలో భాగంగా ఈ భూమిని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు పొందే విధంగా 3.27 లక్షల మంది దళిత యువతకు సాఫ్ట్‌వేర్, ఆంగ్ల భాష, తదితర అంశాల్లో స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇప్పించనున్నట్లు చెప్పారు.
రుణాల శే్వతపత్రం విడుదల
కార్పొరేషన్ ద్వారా 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో జీవో నెంబర్ 25 ప్రకారం ఎస్సీలోని 52 కులాల వారికి ఇచ్చిన రుణాల శే్వతపత్రాన్ని చైర్మన్ జూపూడి విడుదల చేశారు. జిల్లాలు, కులాల వారీగా లబ్ధిదారుల వివరాలు అందులో పొందుపరిచారు. పరిమితికి మించి మాదిగలకు రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. జనాభా ప్రాతిపదికన మాదిగలకు ఇవ్వవలసిన దానికంటే 3651 మందికి అదనంగా, మాలలకు 665 మందికి తక్కువగా రుణాలు అందజేసినట్లు వివరించారు.
రెల్లి కులస్తులకు కూడా 111 మందికి అదనంగా రుణాలు ఇచ్చామని, ఇతర కులాల్లో వారు దరఖాస్తు చేసుకోకపోవడం వల్లగానీ, ఇతర కారణాల వల్ల గానీ తక్కువ మందికి ఇచ్చామని తెలిపారు. మాలలకు 69 వాహనాలు, మాదిగలకు 61 వాహనాలు ఇచ్చినట్లు తెలిపారు. డైరెక్టర్ ఆకెపోగు ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో వంద కోట్ల రూపాయల లోపు ఉన్న బడ్జెట్‌ను రూ.2713 కోట్లకు పెంచారన్నారు. జీవో 25 ప్రకారం అందరికీ ప్రయోజనాలు అందుతున్నాయని, మాదిగలకు పెద్దపీట వేశారని చెప్పారు. ఈ జీవో అమలును పర్యవేక్షించడానికి ఒక ఐఏఎస్ అధికారిని నియమించడానికి సిఎం అంగీకరించారని తెలిపారు.