ఆంధ్రప్రదేశ్‌

ఐఎన్‌ఎస్ విరాట్‌పై త్వరలో డిపిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విరాట్‌ను ఆధునిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. నౌకను మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు వీలుగా కన్సల్టెంట్‌ను ఖరారు చేయగా, ఇప్పటికే ప్రాథమిక నివేదికను రాష్ట్ర పర్యాటక శాఖకు అందచేసింది. నౌకాదళ సేవల నుంచి ఉపసంహరించిన తరువాత, ఆ నౌకను సముద్రంలో కదిలే మ్యూజియంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు పోటీపడ్డాయి. అయితే ఏపికి ఆ నౌకను కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో ఆ నౌకను విశాఖ వద్ద ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. నౌకను పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీనిపై సవివర నివేదక తయారీకి 60 లక్షల రూపాయలకు ముంబయికి చెందిన సంస్థకు కాంట్రాక్టు ఖరారు చేసింది. ఈ మేరకు ఇటీవల 25 శాతం నిధులను కూడా విడుదల చేసింది. ఈ సంస్థ తమ ప్రాథమిక నివేదికను పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు అందచేసింది. ఐఎన్‌ఎస్ విరాట్‌ను ఆధునిక హంగులతో వినోద, విజ్ఞానదాయకంగా మార్చేందుకు వీలుగా ప్రతిపాదనలను ఆ సంస్థ ప్రతిపాదించింది. ప్రధాన డెక్ భాగాన్ని ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంగా మలచేందుకు ప్రతిపాదించారు. సౌండ్ అండ్ లైట్ షో, చిల్డ్రన్ థీమ్ పార్కు, అక్వేరియం, ఆధునిక రెస్టారెంట్ వంటివి ఏర్పాటు ద్వారా ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించే వీలు ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. భిన్న విభాగాలు కాకుండా, ఒకదానితో ఒకటి పోల్చలేని విధంగా అభివృద్ధి చేస్తే, ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని భావిస్తోంది. కాగా ఈ సంస్థ 20 రోజుల్లో సవివర ప్రాజెక్ట్ నివేదిక (డిపిఆర్)ను అందచేయనుంది. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మీనా తెలిపారు. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు పలు ప్రాజెక్టులు ఆసక్తి చూపుతున్నాయని, కానీ ఆయా సంస్థల సామర్థ్యం, నిర్వహణలో అనుభవం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. సిఎం ఆమోదం తరువాతే ప్రాజెక్టు పనులపై ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

చిత్రం..ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ధనౌక