ఆంధ్రప్రదేశ్‌

ఈపిడిసిఎల్‌లో ‘మై ఈపి’ మొబైల్ యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 26: ఇప్పటి వరకు విద్యుత్ వినియోగదారుల కోసం పలు రకాలైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఉద్యోగుల కోసం తొలిసారిగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ‘మై ఈపి’ పేరుతో మొబైల్ యాప్ సౌకర్యాన్ని కల్పించింది. మై ఈపి కొత్త మొబైల్ యాప్‌ను శుక్రవారం సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ టివిఎస్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రతి ఉద్యోగి తనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం కోసం తన మొబైల్‌లోనే తెలుసుకోవచ్చన్నారు. ఈ యాప్‌లో ఉద్యోగి పేరు, హోదా, విద్యార్హతలు, కుటుంబ వివరాలు, బ్యాంకు ఖాతా నెంబర్, జిపిఎఫ్/ఇపిఎఫ్ నెంబర్లు పొందుపరిచి ఉంటాయన్నారు. పనితీరుకు సంబంధించిన వివరాలు, వేతన సమాచారం, సెలవుల పట్టిక, అధికారిక ఆర్థిక లావాదేవీల వివరాలు, అధికారిక సమావేశాల సమాచారం వంటివి ఇందులో ఉంటాయన్నారు. ఈ యాప్ ద్వారా ఉద్యోగి సెలవు దరఖాస్తు కూడా చేసుకోవచ్చన్నారు. ఇంక్రిమెట్ వివరాలతోపాటు ఉద్యోగి తనకు సంబంధించిన అధికారిక సమాచారంలో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే ఈ యాప్ ద్వారా సవరించుకోవచ్చన్నారు. కాగా గత ఏడాది నవంబర్ 3న సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈస్ట్రన్ పవర్ మొబైల్ యాప్ ద్వారా 65,124 మంది దాదాపు రూ.6.5 కోట్ల మేర విద్యుత్ చార్జీలను చెల్లించారన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) సి.శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.

chitram యాప్‌ను ప్రారంభిస్తున్న ఎపిఈపిడిసిఎల్ డైరెక్టర్ చంద్రశేఖర్