ఆంధ్రప్రదేశ్‌

భక్తులకు మెరుగైన సేవల కోసం టెంపుల్ మేనేజ్‌మెంట్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 13: రాష్ట్రంలోని 59 ఆలయాల్లో టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టం (టిఎంఎస్) ప్రవేశపెట్టామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ విధానంవల్ల భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే కాకుండా దేవాలయాల్లో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకత పాటించవచ్చన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టంను శుక్రవారం మంత్రి మాణిక్యాలరావు ప్రారంభించి, తొలి టిక్కెట్‌ను దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ యిందుకూరి రంగరాజుకు అందజేశారు. రెండోదశలో భక్తులు ఈ ఆలయాలలో దర్శనం, సేవా టిక్కెట్లు, ఇ-హుండీ మొదలైన సౌకర్యాలు ఆన్‌లైన్‌లో పొందవచ్చని, త్వరలో ఈ సౌకర్యం భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తదుపరి దశలో రూ.25 లక్షల వార్షిక ఆదాయం కలిగిన దేవాలయాలలో కూడా ఈ విధానం ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. అన్ని దేవాలయాలలోను ఆన్‌లైన్ సేవలకు ఆయా దేవస్థానాల ఆదాయం ద్వారా వచ్చిన నిధులతో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సేవలు, సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కొన్ని దేవాలయాలలో దర్శనం టిక్కెట్లు రీసైక్లింగ్ చేయడం, సరైన సమాచారం ఉన్నతాధికారులకు వెళ్ళకుండా జాప్యంచేయడం వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి ఆన్‌లైన్ విధానంలో దర్శనం, సేవల టిక్కెట్లు కొనుగోలు చేసుకునే విధానం అమల్లోకి తెచ్చామన్నారు. టిఎంఎస్.ఎపి.జిఒవి.ఇన్ పోర్టల్‌లో ఆన్‌లైన్ టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మద్ది దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాధరాజు (శివ), ధర్మకర్తల మండలి సభ్యులు కేదాసు అర్జునరావు, కర్పూరం వెంకన్నబాబు, మానుకొండ వెంకటరెడ్డి, ధూళిపాళ ప్రభాకరరావు, తూటికుంట రాము తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో టెంపుల్ మేనేజ్‌మెంట్ విధానాన్ని ప్రారంభిస్తున్న మంత్రి మాణిక్యాలరావు