ఆంధ్రప్రదేశ్‌

నవంబర్ నెలాఖరుకు అగ్రి ఇంక్యుబేటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: రాష్ట్రంలో నవంబర్ నెలాఖరునాటికి అగ్రి ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అగ్రి ఇంక్యుబేటర్లలో వ్యవసాయానికి సంబంధించి వివిధ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇచ్చేలా అగ్రి ఇంక్యుబేటర్లను అభివృద్ధి చేయాలన్నారు. ఇంక్యుబేటర్స్‌లో డబ్బులు వసూలు చేయవద్దని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో ఎపి ఇన్నోవేషన్ సొసైటీ, ఐటి శాఖ అధికారులతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎపి ఇన్నోవేషన్ సొసైటీ నిర్వహిస్తున్న ఇంక్యుబేటర్లలో యువత తమ కాళ్ల మీద తాము నిలబడేంత వరకూ ప్రోత్సాహం ఇచ్చేలా విధానం రూపొందించాలన్నారు. కాలక్షేపానికి వచ్చే వారికి సొసైటీ వేదిక కారాదని, నిబద్ధతతో ఎదగాలనుకున్న వారిని వడపోసి అవకాశం కల్పించాలన్నారు. ఇంక్యుబేటర్ల ద్వారా ఒక బిలియన్ డాలర్ కంపెనీగా ఎదగాలన్న లక్ష్యం సాధించాలన్నారు.
ఐఒటిలో భాగంగా నిర్వహిస్తున్న బూట్ క్యాంప్స్‌ను అన్ని కళాశాలల్లో నిర్వహించాలని, 80 కళాశాలల్లో టింకరింగ్ ల్యాబ్‌లను ప్రారంభించాలని ఆదేశించారు. నెలకో హ్యాకథాన్ నిర్వహించాలన్నారు. స్మార్ట్ సిటీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు వేగవంతం చేయాలని, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఐఒటి ఏర్పాటుకు కేంద్రం అనుమతి లభించిందని, నిధుల కోసం సంప్రదింపులు జరిపి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. 16 స్టార్ట్‌అప్ కంపెనీలను ఇంక్యుబేట్ చేశామని, వాటిలో నాలుగు పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించామని మంత్రికి అధికారులు వివరించారు. డ్రోన్ ఇంక్యుబేషన్ సెంటర్‌కు ఆఫీస్ స్పేస్ ఇచ్చామని, వచ్చే జనవరి 15కు మొదటి డ్రోన్ తయారవుతుందని వివరించారు.
అనంతరం జరిగిన ఇ-ప్రగతి సమీక్షలో ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా అన్ని ప్రభుత్వ శాఖలను ఈ-ప్రగతి ప్లాట్‌ఫాంపైకి తీసుకురావాలన్నారు. ఈ-ప్రగతి కోర్ ప్లాట్‌ఫాంతో వర్క్ మానేజ్‌మెంట్ పూర్తి చేయాలన్నారు. సిఎం డ్యాష్ బోర్డులో వివిధ శాఖల పనితీరు, డేటా అనలిటిక్స్ ద్వారా వివిధ సమస్యలకు పరిష్కారం ఇచ్చే విధంగా తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఈ-ప్రగతి సిఇఒ బాలసుబ్రహ్మణ్యం, ఐటి సెక్రటరీ విజయానంద్, తదితరులు పాల్గొన్నారు.