ఆంధ్రప్రదేశ్‌

హంద్రీ ఉగ్రరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్ట్‌సిటీ, అక్టోబర్ 13: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు హంద్రీనది ఉగ్రరూపం దాల్చింది. దీనికి తోడు గాజులదినె్న ప్రాజెక్టు నుంచి వరద నీటిని నదిలో విడుదల చేయడంతో శుక్రవారం కర్నూలు నగరం నడిబొడ్డున వరదనీరు రోడ్లపైకి చేరింది. నగరంలోని ఆనంద్ టాకీసు బ్రిడ్జి కిందకు వరదనీరు చేరుకోవడంతో కొత్త బస్టాండ్ - పాత బస్టాండ్ మధ్య రాకపోకలు నిల్చిపోయాయి. అండర్ బ్రిడ్జి, రైల్వే వంతెనల కింద హంద్రీనీరు ప్రవహించడంతో జనం చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆనంద్ టాకీసు బ్రిడ్జి వద్ద వరద నీరు రావడంతో అటుగా వాహనాలను పోలీసులు అనుమతించ లేదు. హంద్రీ నది వరదకు పాత నగరంలోని లోతట్టు ప్రాంతాలైన బుధవారపేట, జొహరపురం, కుమ్మరివీధి జమ్మిచెట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడం జనం ఇబ్బందిపడ్డారు. దీంతో రెవెన్యూ, పోలీసు అధికారులు, నగర పాలకసంస్థ అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. కల్లూరులోని వక్కిలేరు వాగు వంతెన పైనుంచి వరదనీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 2009 వరదల తర్వాత హంద్రీనదికి భారీగా నీరు రావడం ఇదే. కర్నూలు నడిబొడ్డున హంద్రీనది ప్రవాహాన్ని చూసేందుకు ప్రజలు బారులు తీరారు.