ఆంధ్రప్రదేశ్‌

అంచలంచెలుగా డిమాండ్ల సాధన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నవంబరు 3,4 తేదీల్లో తిరుపతిలో నిర్వహించనున్న ఏపి ఎన్‌జివో అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు వేదిక కానున్నాయని ఏపి ఎన్‌జివో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు వెల్లడించారు. ఏపి ఎన్‌జివో అసోసియేషన్ పశ్చిమ కృష్ణా కార్యవర్గ సమావేశం శనివారం గాంధీనగర్‌లోని ఏపి ఎన్‌జివో హోంలో నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తిరుపతి కౌన్సిల్ సమావేశాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఉద్యోగుల సమస్య పరిష్కారం కొరకు ఎన్నో పోరాటాలు చేశామన్నారు. ముఖ్యంగా వేతన సవరణ సంఘాన్ని నియమించేందుకు ఉద్యోగులు పలు దఫాలుగా ఉద్యమం చేపడితే కాని ప్రభుత్వం వేతన సవరణ సంఘాన్ని నియమించే పరిస్థితి లేదన్నారు. అయితే ఎటువంటి ఆందోళనలు లేకుండానే 10వ వేతన సవరణ సంఘాన్ని నియమించడం జరిగిందని, ఇప్పటికి 11వ వేతన సవరణ సంఘాన్ని కూడా ప్రభుత్వం అదే విధంగా నియమిస్తుందని ఆశిస్తున్నామన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వం నుండి ఉద్యోగులకు సంబంధించి ప్రధాన డిమాండ్లను అంచెలంచెలుగా సాధించుకున్నామన్నారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంలో ఎదురయ్యే కొన్ని సాంకేతికపరమైన సమస్యలను అధిగమించే డిమాండ్లను సాధించగలుగుతున్నామన్నారు. పిఆర్‌సి ఎరియర్స్, 11వ వేతన సవరణ సంఘం నియామకం, డిఎ బకాయిల చెల్లింపు, పూర్తిస్థాయిలో హెల్త్ కార్డుల అమలు వంటి ఉద్యోగుల ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి పరిష్కారాన్ని వేదికపై ప్రకటించేందుకు ఏపిఎన్‌జివో అసోసియేషన్ బలోపేతం అవుతుందన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు అసోసియేషన్ మరింత బలోపేతం అవుతుందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒకే క్యాడర్ విధానం రద్దు వంటి ప్రధాన డిమాండ్లపై 3,4 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో సమావేశాలను ఎవరి నుండి ఎటువంటి ఆర్ధిక సహకారం లేకుండా కేవలం ఏపి ఎన్‌జివో అసోసియేషన్ ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 3వ తేదీన రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప కౌన్సిల్ సమావేశాలను ప్రారంభిస్తారని, 4వ తేదీన ముఖ్యమంత్రి కౌన్సిల్ సమావేశాలకు హాజరుకానున్నారన్నారు.