ఆంధ్రప్రదేశ్‌

మాటల మరాఠీ మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: దేశంలో మాటల మరాఠీ నరేంద్రమోదీ పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ప్రస్తుత దేశ రాజకీయాల్లో బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా కీలక వ్యక్తిగా మారారనీ, ప్రతిపక్షాల విమర్శలకు స్పందిస్తూ అమిత్‌షా ‘మాట్లాడే ప్రధానిని ఇచ్చాం’ అని చెబుతున్నారని, నిజంగానే మోదీ ‘మాటల మారాఠీ’ అని అన్నారు. అయితే మోదీ మన్‌కీ బాత్ సహా ఏ రాష్ట్రానికి వెళ్లినా మాటల గారడీతో ప్రజలను మభ్యపెట్టడం మినహా మూడున్నరేళ్ల కాలంలో చేసిందేమీ లేదన్నారు. బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోలోని ఏ ఒక్క అంశాన్ని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. విజయవాడ దాసరి భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికా సహా ఎక్కడకు వెళ్లినా సరే ఒకే రకమైన ఉపన్యాసాలతో మోసం చేస్తున్నారన్నారు. విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం.. ఏటా 2కోట్ల ఉద్యోగాలిస్తాం.. అని ఎన్నికల్లో ఊకదంపుడు ప్రసంగాలు చేసిన మోదీ తీరా గెలిచిన తర్వాత హామీలను విస్మరించడం దారుణమన్నారు. అమిత్‌షా కుమారుడి అక్రమ సంపాదన విషయమై మీడియాలో వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం పరువు నష్టం దావా వేయడమే కాకుండా కేసును వాదించేందుకు అటార్నీ జనరల్‌ను నియమించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇంతకంటే అధికార దుర్వినియోగం వేరొకటి లేదన్నారు. విశాఖపట్నంలో రెండుసార్లు పారిశ్రామికవేత్తలతో సదస్సులను నిర్వహించి, రాష్ట్రానికి రూ.16లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయనడాన్ని ఎద్దేవా చేశారు. అనంతపురం కియా ఫ్యాక్టరీ తప్ప మరెక్కడా కొత్తగా పరిశ్రమలు రాలేదన్నారు. అదీకాక ఈ సంస్థకు కేటాయించిన భూమిని చదును, మెరక చేసేందుకు రూ.170 కోట్లను ప్రభుత్వమే ఖర్చు చేస్తోందన్నారు. అలాగే విద్యుత్, నీటి పంపిణీ విషయాల్లో రాయితీలు వంటి గొంతెమ్మ కోర్కెలతో కంపెనీ అనేక నిబంధనలు పెడుతోందన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రానికి ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయో.. ఎన్ని పరిశ్రమలు స్థాపించారో.. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారనే విషయాలపై ప్రభుత్వం శేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో, వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. విలేజ్ మాల్స్ ఏర్పాటు పేరుతో కార్పొరేట్ సంస్థలకు అవకాశం కల్పిస్తూ చౌకధరల దుకాణాలను ఎత్తివేయడం వల్ల, 5వేల హమాలీ కుటుంబాలే కాకుండా అనేకమంది రేషన్ డీలర్లు రోడ్డున పడతారని ఆయన ఆందోన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్న హమాలీలు, రేషన్ డీలర్లకు సిపిఐ తరపున సంపూర్ణ మద్దతును ఆయన ప్రకటించారు.