ఆంధ్రప్రదేశ్‌

కాపు కార్పొరేషన్ ఆఫీసులో హైడ్రామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: కాపు కార్పొరేషన్ ఎండీ అమరేంద్రపై వేటు పడిన నేపథ్యంలో ఆయన ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హైడ్రామా నడిచింది. నగరంలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు తన చాంబర్‌లో అమరేంద్ర కూర్చున్న సమయంలో సంస్థ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అక్కడికి రావడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ‘రికార్డులు ట్యాంపరింగ్ చేసేందుకు వచ్చారా?’ అంటూ చైర్మన్ రామానుజయ ప్రశ్నించారు. తాను మీడియా సమావేశం నిర్వహించేందుకు వచ్చానని, సిఎంవో నుంచి ఆదేశం వచ్చిందని అమరేంద్ర వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే తానూ ఈ సమావేశంలో పాల్గొంటానని చైర్మన్ అన్నారు. అందుకు అమరేంద్ర అంగీకరించకుండా, ఇది ఎండీ చాంబర్ అంటూ బదులిచ్చారు. అయినా ఇది కార్పొరేషన్‌కు సంబంధించిన కార్యాలయమని, తానూ మీడియా సమావేశంలో పాల్గొంటానని చైర్మన్ అన్నారు. ఒకదశలో పైన ఉన్న కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు ప్రతిపాదించి, చైర్మన్ అక్కడకు వెళ్లారు. ఎంతసేపటికీ ఎండీ రాకపోవడంతో ఆయన కిందికి దిగి వచ్చారు. తమ అనుమతి లేకుండా కార్పొరేషన్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టకూడదని, ఎవరు ఆదేశించారో చెప్పాలని చైర్మన్ ప్రశ్నించగా, ఆ అధికారి పేరును అమరేంద్ర చెప్పలేదు. దీంతో కార్యాలయ వెలుపల ప్రెస్‌మీట్ నిర్వహించుకోవాలని సూచించారు. వాగ్వివాదం తరువాత కార్పొరేషన్ కార్యాలయం వెలుపల ప్రెస్‌మీట్ నిర్వహించారు. తాము ప్రెస్‌మీట్‌ను అడ్డుకోలేదని రామాజనుయ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ప్రెస్‌మీట్ నిర్వహించడంపై అభ్యంతరం మాత్రమే వ్యక్తం చేశానని ఆయన తెలిపారు.