ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణ కార్పొరేషన్ పథకాలతో లబ్ధిపొందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 15: రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ సంక్షేమ పథకాలను అందుకుని బ్రాహ్మణ మహిళలు అభివృద్ధి సాధించాలని రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీ శేషసాయి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు ఆదివారం జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ జీవితగమనంలో బ్రాహ్మణులు చాలా కీలకమని, సమాజాన్ని దైవత్వానికి అనుసంధానం చేసిన బ్రాహ్మణులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశంలోనే మొదటి సారిగా రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేశారన్నారు. కీలక స్థాయిలో బ్రాహ్మణ మహిళాభ్యుదయాన్ని సాధిస్తోందన్నారు. అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందుతున్నారన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ సంక్షేమాన్ని అందుకుని అభివృద్ధి చెందాలన్నారు. మహిళలకు పెద్ద పీటవేస్తే వారి సంకల్పబలంతో సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. పార్టీ రహితంగా బ్రాహ్మణ కార్పొరేషన్ సంక్షేమ ఫలాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయాలని మేయర్‌ను ఎపి బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు శ్రీకాంత్ కోరారు. రాష్ట్ర బ్రాహ్మణ మహిళా సంఘం అధ్యక్షురాలు ప్రొఫెసర్ రెంటచింతల దీప్తి మాట్లాడుతూ మహిళలు గౌరవించిన సమాజమే అభివృద్ధి చెందుతుందని రామాయణంలోని ఒక చిన్న అధ్యాయాన్ని వివరించారు. సదస్సులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరి సతీష్ శర్మ, కార్యనిర్వహణ కార్యదర్శి రెంటచింతల మధుసూదనశర్మ, రాష్ట్ర బ్రాహ్మణ మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి కె నాగలక్ష్మి తదితరులు హాజరయ్యారు. డాక్టర్ ఏడిద బాలసుబ్రహ్మణ్య శర్మ 35 అవార్డులు సాధించిన ‘అమ్మ ఆడది’ గీతాలాపన ఆకట్టుకుంది. సంగీత కచేరి నిర్వహించిన మల్లాది నర్శింహారావు, మృదంగ విద్వాన్, బాలమురళీకృష్ణ మనవడు రాయప్రోలు నాగగనికను సత్కరించారు.

చిత్రం..సదస్సులో జ్యోతి వెలిగిస్తున్న మేయర్ రజనీ శేషసాయి