ఆంధ్రప్రదేశ్‌

మహా సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 27: తెలుగుదేశం పార్టీ మహానాడు సంబరాలు శుక్రవారం తిరుపతిలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. టిడిపి ఆవిర్భవించి 34 సంవత్సరాలు పూర్తిచేసుకుని 35వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడామైదానంలో మూడు రోజులపాటు జరిగే మహానాడు సభలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10 గంటలకు చేరుకున్నారు. ముందుగా పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్న చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి ప్రాంగణంలో ఎన్‌టిఆర్ రక్తదాన శిబిరాన్ని, త్రిడి షోను, ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం వేదిక వద్దకు చేరుకుని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్ టి రామారావు విగ్రహానికి పూల మాలలు వేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడు సమావేశాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ, ఏపి, తెలంగాణ రాష్ట్రాల టిడిపి అధ్యక్షులు కళావెంకట్రావు, రమణ, మంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి పలువురు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎన్‌టిఆర్ అమర్హ్రే, చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో సభాప్రాంగణం హోరెత్తింది.
మూడు దశల్లో
28 తీర్మానాలు
రాష్ట్రం, పార్టీ అభివృద్ధితోపాటు
ప్రతిపక్షపార్టీని ఎండగట్టే తీర్మానాలు చేస్తాం
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు
తిరుపతి, మే 27: తెలుగుదేశం పార్టీ మహానాడులో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, భవిష్యత్ కార్యాచరణపైనే కాకుండా ప్రతిపక్ష పార్టీ అనుసరిస్తున్న అభివృద్ధి నిరోధక తీరుపై కూడా తీర్మానాలు చేస్తామని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. స్థానిక నెహ్రూమున్సిపల్ హైస్కూల్ క్రీడామైదానంలో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడు సభాప్రాంగణంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఈ మహాసభల్లో మూడు దశల్లో మొత్తం 28 తీర్మానాలు చేయనున్నామన్నారు. ఎన్నికలకు ముందు పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలేకాకుండా, మ్యానిఫెస్టోలో లేని అనేక అంశాలపై హామీలు ఇచ్చామన్నారు. ఈ హామీల అమలు ఎంత వరకు జరిగింది, అమలు కాని హామీలు, వీటిపై ప్రజా స్పందనపై కూడా చర్చించి అవసరాన్ని బట్టి భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలు గురించి తీర్మానాలు చేస్తామన్నారు. రెండవ దశలో కేంద్ర,రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పరిస్థితులుపై చర్చించి తీర్మానాలు చేస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కూడా చర్చిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సహకరించకుండా మోకాలడ్డుతున్న ప్రతిపక్షం తీరును ఎండగడతామన్నారు. చివరి రోజున రాజకీయ తీర్మానాలు ఉంటాయని వివరించారు.
విభజన చట్టం అమలుపై చర్చ: కళా వెంకట్రావు
తిరుపతి, మే 27: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుపై కూడా మహానాడులో చర్చించి తీర్మానాలు చేస్తామని టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఅధ్యక్షులు కిమిడి కళావెంకట్రావు స్పష్టం చేశారు. స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం టిడిపి మహానాడు ప్రారంభం సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ మహానాడుకు 30వేల మందికి ఆహ్వానాలు పంపామని చెప్పారు. అయితే అనుకున్న దానికన్నా ఎక్కువ మంది హాజరవుతున్నారన్నారు. మహాసభకు ఎంతమంది హాజరైనా వారందరికి అవసరమైన భోజనాలు ఏర్పాటు చేశామని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశనిర్దేశం చేసేలా మహాసభలు జరుగుతాయని తొలి రోజు 14 తీర్మానాలు ప్రవేశపెడతామన్నారు. ఇందులో ఏపి, తెలంగాణ రాష్ట్రాలు రెండింటికి కలిపి తీర్మానాలు చేస్తామన్నారు. ఈ తీర్మానాల్లో రాష్ట్ర విభజన సమయంలో చేసిన విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాల్సి ఉందని, దీనిపై చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.