ఆంధ్రప్రదేశ్‌

ఐఎఎస్ చదువుతా.. బాబు దగ్గర పనిచేస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: ప్రతిభా పురస్కార గ్రహీతల జీవిత లక్ష్యాలను తెలుసుకుని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఇక్కడ జరిగిన సభలో వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంలో విద్యార్థులు తమ ఆశలు, ఆశయాలు చెపుతుంటే వింటూ ముఖ్యమంత్రి మురిసిపోయారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని ఓ కళాశాల నుంచి బిట్స్ పిలానీకి ఎంపికైన షేక్ షర్మిల మాటలకు ముఖ్యమంత్రి ఆద్యంతం సంతోషంగా కనిపించారు. ఐఎఎస్ చదివి చంద్రబాబు వద్దనే పనిచేయాలని తనకు కోరికగా ఉందని షర్మిల చెప్పినప్పుడు ముఖ్యమంత్రి ఆనందభరితులయ్యారు. చంద్రబాబు స్పందిస్తూ తాను గతంలో వాగ్దానం చేసినట్లు షర్మిలకు బిట్స్ పిలానీ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.
రూ.20వేల నగదు మాకెంతో గొప్ప!
తాను పేద రైతు కుటుంబం నుంచి వచ్చానని, రూ.20 వేలు ప్రతిభా పారితోషికం తనకు ఎంతో పెద్దమొత్తమని చిత్తూరు జిల్లాకు చెందిన జెడ్పీ స్కూలు విద్యార్థి వై దయానంద్ ఆనందం వ్యక్తపర్చాడు. కృష్ణా జిల్లా నందివాడ జెడ్పీ పాఠశాల విద్యార్థిని విహన మాట్లాడుతూ అనేక మందికి జిల్లా పరిషత్ పాఠశాలలంటే చాలా చిన్నచూపు ఉంటోందని చెప్పింది. విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ, డిజిటల్ క్లాసెస్ లాంటి వినూత్న విధానాలు, పథకాలు ప్రవేశపెట్టారని చంద్రబాబుపై ప్రశంసలు కురిపించింది. తనలాంటి పేద విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఎంతో స్ఫూరిస్తున్నాయని తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తాను ఐఎఎస్ చేస్తానని ఆత్మవిశ్వాసంతో బదులిచ్చింది. అందుకు చంద్రబాబు బాలికను అభినందించారు.
ఆడపిల్లల్ని దత్తత తీసుకుని చదివిస్తా!
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు పాఠశాల విద్యార్థిని సాయి అశ్విత మాట్లాడుతూ తల్లిదండ్రులు వద్దనుకుంటున్న ఆడపిల్లలను దత్తత తీసుకుని పెంచుతానని, వారిని చదివిస్తానని చెప్పింది. ఇంకా తల్లిదండ్రులు ఆడపిల్లల్ని వద్దనుకుంటున్నారా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే మంచి నిర్ణయాలు తీసుకుంటారని తల్లిదండ్రులకు సందేశమివ్వాలని సాయి ఆత్మికకు చంద్రబాబు సూచించారు. ఇవాళ అన్ని కాలేజీల్లో ఆడపిల్లలే కనిపిస్తున్నారని, కొన్నిరోజులు పోతే మగపిల్లలే ఎదురుకట్నమిచ్చి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటారని చమత్కరించారు. గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ నుంచి వచ్చిన విద్యార్థిని ఎల్ రమ్యశ్రీ మాట్లాడుతూ తాను ఒక ఆటోడ్రైవర్ కుమార్తెనని తెలిపింది. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన ఆనందాచారి మాట్లాడుతూ మంచి ఎవరు చేసినా ప్రోత్సహించాలని కోరాడు. అదే తమ సిద్ధాంతమని చెబుతూ ముఖ్యమంత్రిని ఆకట్టుకున్నాడు. తల్లిదండ్రుల తరపున పద్మావతీదేవి అనే గృహిణి మాట్లాడారు. ముఖాముఖి కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

చిత్రం....ప్రతిభా పురస్కారాల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముఖాముఖిలో
మాట్లాడుతున్న షర్మిల