ఆంధ్రప్రదేశ్‌

1న ‘దేశం’లోకి ఎంపీ రేణుక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 15: కర్నూలు ఎంపీ (వైసిపి) బుట్టా రేణుక నవంబర్ 1న తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. ఈమేరకు ఆమె పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్‌తో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా వైసీపీకి చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమయింది. గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే, కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, కడప జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే, విజయనగరం జిల్లాకు చెందిన మరో ప్రజాప్రతినిధి కూడా టిడిపిలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరి చేరికకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన టిడిపి నాయకత్వం, తొలిదశలో వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకురావాలని నిర్ణయించింది. నిజానికి ఆ ఎమ్మెల్యేతో జిల్లాకు చెందిన ఓ మంత్రి, రాయలసీమకు చెందిన ఓ రాజ్యసభ సభ్యుడు చాలాకాలం నుంచీ మంతనాలు జరుపుతున్నారు.