ఆంధ్రప్రదేశ్‌

డెడ్‌లైన్లను లెక్కచేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, అక్టోబర్ 16: పాత సమస్యల పరిష్కారంపై వచ్చే డిసెంబర్ మొదటి వారానికి ప్రభుత్వానికి కాపు ఉద్యమ సంఘ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం డెడ్‌లైన్ విధించడం విడ్డూరంగా ఉందని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ముద్రగడ డెడ్‌లైన్‌ను లెక్కచేసేది లేదని స్పష్టం చేశారు. సోమవారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాపులకు బిసి రిజర్వేషన్ కల్పిస్తామని, అన్నివిధాలా ఆదుకుంటామని చంద్రబాబు ప్రకటించారన్నారు. ఈ హామీ అమలుకు స్వాగతించాల్సింది పోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసేందుకు సిద్ధం కావడం అన్యాయమన్నారు. మాజీమంత్రి ముద్రగడ శాంతియుతంగా ఏ కార్యక్రమం చేసినా తమకు అభ్యంతరం లేదని, ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం చేయడంతో శాంతిభద్రతలకు విఘాతం కలగడం వలనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రౌడీషీటర్ల ఆగడాలను అరికట్టగలిగామన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా రౌడీషీటర్ల ఆగడాలను ఇట్టే తెలుసుకుంటున్నామని అన్నారు. ఎర్రచందనం అక్రమ తరలింపును 80శాతం అరికట్టగలిగామన్నారు. అక్రమ గంజాయి తరలింపును చాలా వరకు అడ్డుకోగలిగామన్నారు. గంజాయి అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతుందని మంత్రి అయ్యన్న చేసిన ప్రకటనను హోంమంత్రి దృష్టికి తీసుకురాగా, తమకు ఆధారాలతోసహా ఫిర్యాదుచేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమేనన్నారు. మావోయిస్టుల ప్రాబల్యం బాగా తగ్గిందని, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో స్థావరాలు ఏర్పరచుకుని ఆంధ్రప్రదేశ్‌లో చొరబడుతున్నారన్నారు. మారమూల గిరిజన ప్రాంతాలకు పక్కాగా రోడ్లు నిర్మించడం ద్వారా నక్సల్స్ ప్రాబల్యాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విశాఖపట్నంలో అధునాతన ఎస్పీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని, డిఐజి కార్యాలయాన్ని ఇప్పటికే నిర్మించామని తెలిపారు.