ఆంధ్రప్రదేశ్‌

విచారణ పేరుతో అవమానించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, అక్టోబర్ 16: విచారణ పేరుతో అధ్యాపకుడిని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి అవమానించారంటూ రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటి, ఇక్కడే తరగతులు నిర్వహిస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్ ఐటి అధ్యాపకులు సోమవారం రాత్రి మెరుపు ధర్నాకు దిగారు. నూజివీడు సర్కిల్ ఇనస్పెక్టర్ రామ్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళానికి చెందిన విద్యార్థిని డి రమాదేవి శనివారం ట్రిపుల్ ఐటిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటనపై విశ్వవిద్యాలయం అధికారుల అనుమతి లేకుండా ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న అధ్యాపకుడు జి ఫణికుమార్‌ను విచారణ కోసం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామ్‌కుమార్ రాత్రివేళ తీసుకువెళ్ళి, బట్టలు విప్పతీసి, దిగంబరంగా నిల్చోబెట్టి విచారణ జరిపి, అనుచితంగా ప్రవర్తించిన విషయం సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహించిన రాత్రి 8.30 గంటల సమయంలో ట్రిపుల్ ఐటీలో మెరుపు ధర్నాకు దిగారు. ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న అధ్యాపకుడు జి ఫణికుమార్‌ను ఒక నిందితుడిగా ఎందుకు తీసుకువెళ్ళారని ప్రశ్నించారు. ట్రిపుల్ ఐటీ అకడమిక్ సెల్ కన్వీనర్ కె హనుమంతరావు మాట్లాడుతూ అధ్యాపక వృత్తిలో ఉన్న వ్యక్తిని పోలీసులు రాత్రి వేళ తీసుకువెళ్ళి, చెప్పలేని విధంగా విచారించటం క్షమించరాని నేరమని అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సిఐను సస్పెండ్ చేసే వరకు తరగతులకు వెళ్ళే ప్రసక్తే లేదని అధ్యాపకులు స్పష్టం చేశారు. ఈ సంఘటనపై విద్యాశాఖతో పాటు, విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులకు ఎందుకు పిర్యాదు చేయలేందంటూ డైరెక్టర్ వీరంకి వెంకటదాసు, ఉప కులపతి రామచంద్రరాజును అధ్యాపకులు నిలదీశారు.

చిత్రం..సోమవారం రాత్రి ధర్నా చేస్తున్న ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు