ఆంధ్రప్రదేశ్‌

ఐసెట్‌లో 54,498 మంది ఉత్తీర్ణత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 27: ఏపి ఐసెట్ 2016 పరీక్షా ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీ సెనెట్ హాల్లో ఆవిష్కరించారు. ఈనెల 16న జరిగిన పరీక్షలకు 64,490 మంది హాజరుకాగా, 54,498 మంది అర్హత సాధించారు. ఇందులో పురుషులు 40,711(63.12 శాతం) ఉత్తర్ణీత సాధించగా, మహిళలు 23,779(36.88 శాతం) ఉత్తీర్ణత సాధించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ ఫలితాలను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఏపిఐసెట్.నెట్.ఇన్‌లో చూడవచ్చని తెలిపారు. రాష్ట్రంలో 384 ఎంబిఏ కళాశాలలో 45,695 సీట్లు ఉన్నాయని, 159 ఎంసిఏ కళాశాలల్లో 10,700 సీట్లు ఉన్నాయని చెప్పారు. ఐసెట్‌లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎస్ జె రాజేంద్రప్రసాద్ 159 మార్కులతో ప్రథమ స్థానంలో నిలువగా, విశాఖపట్టణంకు చెందిన జె వెంకటసాయి కిరణ్ 146 మార్కులతో రెండో స్థానంలోను, శ్రీకాకుళంకు చెందిన రవి కె శాస్ర్తీ ఆకెలా 136 మార్కులతో మూడో స్థానంలో, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సిహెచ్ సుధీర్ 135 మార్కులతో నాల్గవ స్థానంలో, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జి భార్గవి 135 మార్కులతో 5వ స్థానంలో నిలిచారు. ఆ తరువాత వరుసగా చిత్తూరు జిల్లాకు చెందిన టి లోకేష్ 135 మార్కులతో 6వస్థానం, కర్నూలుకు చెందిన యం.జయంత్ 132 మార్కులతో 7వ స్థానం, కృష్ణా జిల్లాకు చెందిన ఇ ఎల్ ఫణేంద్ర 131 మార్కులతో 8వ స్థానం, విశాఖపట్టణంకు చెందిన ఎస్.కె.తఖీయాన్‌జీసుదోరాజ్ 130 మార్కులతో 9వ స్థానం, గుంటూరుకి చెందిన షేక్ ఫరీదాబేగం 129 మార్కులతో 10వ స్థానంలో నిలిచారని మంత్రి వెల్లడించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు నిర్వహించిన ప్రతి ఒక్కరికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వీనర్ ఎస్.రామ్మోహన్, ఎస్వీయూ విసి దామోదరం, రిజిస్ట్రార్ దేవరాజులు నాయుడు, మహిళ విశ్వవిద్యాలయం విసి దుర్గ్భావాని, ద్రవిడ విశ్వవిద్యాలయం విసి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన పిజిఈసెట్-2016
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, మే 26: ఈనెల 25వ తేదీ నుండి నిర్వహిస్తోన్న ఎపి పిజిఈసెట్-2016 శుక్రవారంతో ముగిసింది. మూడు రోజుల పాటు రాష్ట్రంలో కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, విజయవాడ, అనంతపురం రీజనల్ సెంటర్ల పరిధిలోని 79 కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్షలు అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగినట్టు పరీక్షల కన్వీనర్ డాక్టర్ జివిఆర్ ప్రసాదరాజు చెప్పారు. శుక్రవారం సాయంత్రం ప్రిలిమినరీ కీని వర్సిటీ వెబ్‌సైట్‌లో విడుదల చేసినట్టు చెప్పారు. పరీక్షలపై అభ్యంతరాలుంటే ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్ధులకు ఆయన విజ్ఞప్తి చేశారు. చివరి రోజు నిర్వహించిన పరీక్షలలో ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగానికి సంబంధించి 199 మంది దరఖాస్తు చేసుకోగా 154 మంది హాజరయ్యారు.

బాధితులకు
బాసటగా నిలుస్తా
న్యాయం చేయకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా: జగన్
ప్రత్తిపాడు, మే 27: అధైర్యపడొద్దు... మీకు అండగా నేనుంటా... అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి భవన నిర్మాణ పనుల్లో మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఇటీవల గుంటూరు లక్ష్మీపురంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం మట్టిపెళ్లలు విరిగిపడి సజీవ సమాధైన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం, పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన ఏడుగురు మృతుల కుటుంబాలను శుక్రవారం జగన్ ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను పది రోజుల్లో నెరవేర్చకుంటే జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తానని ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. మృతిచెందిన కార్మికులకు 20 లక్షల పరిహారం ఇస్తామన్నారనీ అయితే ఒక్కో మృతుని కుటుంబానికి 13 లక్షలు ఇన్స్యూరెన్స్ రూపంలోనే వస్తుందని, ప్రభుత్వం 5 లక్షలు ప్రకటించగా ప్రమాదానికి ప్రధాన కారకుడైన బిల్డర్ 2 లక్షలిచ్చి చేతులు దులుపుకోవడంపై మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా మృతుల కుటుంబ సభ్యులను తక్షణమే ఆదుకుని వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.