ఆంధ్రప్రదేశ్‌

రాష్టవ్య్రాప్తంగా బిసి చైతన్య సదస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, అక్టోబర్ 17: రాష్టవ్య్రాప్తంగా వెనుకబడిన తరగతుల (బిసి) చైతన్య సదస్సులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. పార్టీ అనుబంధ ఒబిసి మోర్చా ఆధ్వర్యంలో చైతన్య సదస్సులను ఏర్పాటుచేయనున్నట్లు మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జల్లి మధుసూదన్ చెప్పారు. ఈ నెల 27వ తేదీ నుంచి జిల్లాల వారీగా సదస్సులు జరుగుతాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాజకీయంగా బిసీలను చైతన్యపర్చాల్సిన అవసరం బిజెపికి ఎంతైన ఉందన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ బిసి కమీషన్ ఏర్పాటుచేసి దానికి రాజ్యంగబద్ధత కల్పించాలని భావించి లోక్‌సభలో బిల్లుకు అమోదం తెలిపి రాజ్యసభకు పంపిస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆమోదం తెలపలేదన్నారు. ఇప్పటికే దేశంలోని 18 రాష్ట్రాల్లో బిసీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తదితర కీలకమైన బాధ్యతల్లో ఉన్నారని గుర్తుచేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కూడా బిసీల జాబితాలకు చెందినవారేనన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మాత్రమే బిసీలకు అండగా ఉన్నామని చెప్పుకొంటోందని, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బిసీలకు ఎంతో చేస్తోందని చెప్పుకొచ్చారు.
రానున్న ఎన్నికల దృష్యా బిసీల్లోరాజకీయ చైతన్యం తీసుకురావడానికి సదస్సులు ఉపకరిస్తాయన్నారు.తొలిదశలో ఈ నెల 27న భీమవరం, నవంబర్ 5న గుంటూరు, 12న చిత్తూరు, 30న కడప, కర్నూల్, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తామని వివరించారు. రెండో దశలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ రూరల్, విశాఖ అర్బన్, తూర్పు, కృష్ణా జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తామని మధుసూదన్ వివరించారు.