ఆంధ్రప్రదేశ్‌

గంటా, నారాయణను బర్తరఫ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: ఆంధ్ర రాష్ట్రంలో కార్పోరేట్ కాలేజీల యాజమాన్యాలపై రాష్ట్రప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. విద్యార్ధుల ఆత్మహత్యల పరంపర సాగుతున్నా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని, తక్షణమే మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 40 మంది విద్యార్ధులు ఇటీవల కాలంలో మరణించారన్నారు. కార్పోరేట్ కాలేజీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దాసోహమయ్యారన్నారు. మూటలు, ముడుపుల కోసమే చంద్రబాబు కార్పోరేట్ కాలేజీలతో సమావేశమయ్యారన్నారు. 40 మంది విద్యార్ధులు మరణించాక కూడా మంత్రులు గంటా, నారాయణ రాజీనామా చేయకపోవడం దదారుణబన్నారు. విద్యార్ధులు చనిపోయిన కాలేజీలపై కేసులు పెట్టి మరణాలకు కారణాలను బయటపెట్టాలన్నారు. ఒక ప్రశ్నకు బదులిస్తూ కర్నూలు వైకాపా ఎంపి బుట్టా రేణుకను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదన్నారు. బుట్టా రేణుక పార్టీ మారడంపై స్పందిస్తూ తాను కూడా ఈ విషయాన్ని టీవీల్లో చూశానన్నారు. ఈ రోజు అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు అకాల వర్షాల వల్ల పంటల మునిగి రైతులు ఇబ్బందులు పడుతుంటే, అవేమీ రేణుకకు కనపించలేదా అని ఆయన ప్రశ్నించారు.