ఆంధ్రప్రదేశ్‌

558.5 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, అక్టోబర్ 17: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరదనీరు పోటెత్తుతోంది. శ్రీశైలం క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేయటంతో సాగర్ జలాశయానికి వరదనీటి ఉద్ధృతి పెరుగుతోంది. మంగళవారం రాత్రికి సాగర్ జలాశయం నీటిమట్టం 558.50 అడుగులకు చేరింది. ఇది 238.3125 టిఎంసిలకు సమానం. నాగార్జునసాగర్ జలాశయం నుండి ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884 అడుగుల వద్ద ఉంది. ఇది 210.0314 టిఎంసిలకు సమానం. ఎగువ జలాశయాల నుండి శ్రీశైలానికి 2,51,591 క్యూసెక్కుల నీరు వస్తోంది. నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుండి వస్తున్న వరద నీటిని మంగళవారం ప్రాజెక్టు ఎస్‌ఇ రమేష్ సాగర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఇ మాట్లాడుతూ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల మరమ్మత్తు పనులు ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు.

చిత్రం..వరద నీటితో కళకళలాడుతున్న సాగర్ జలాశయం