ఆంధ్రప్రదేశ్‌

చాలామంది రెడీగా ఉన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 17: తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయి, తనతో కలసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళదామన్న ఆలోచన చాలామందికి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వారు బయటకు రాలేకపోతున్నారని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్భ్రావృద్ధి కోసం అందరూ తనతో అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కర్నూలు వైసీపీ ఎంపి బుట్టా రేణుక మంగళవారం తన అనుచరులతో వచ్చి చంద్రబాబును కలిశారు. అయితే, ఆమె తప్ప అనుచరులు బాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ బుట్టా రేణుక నిండుమనసుతో ముందుకొచ్చి, రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వామినవుతానని చెప్పడం సంతోషకరమని, అందరూ ఆమెను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఒక కుటుంబ పెద్ద తన కుటుంబం కోసం ఎంత కష్టపడతాడో, తాను ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్భ్రావృద్ధి కోసం అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నానని చెప్పారు. ‘నాకు తెలుసు. ఇంకా చాలామందికి పార్టీలో చేరాలని ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల బయటకు రాలేకపోతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇతర పార్టీ వాళ్లూ ఆకర్షితులవుతున్నారు. ఇది శుభసూచికం. అంతా కలసి రాష్ట్రం కోసం పనిచేద్దామ’ని పిలుపునిచ్చారు.
అనంతరం బుట్టా రేణుక మాట్లాడుతూ గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన స్వర్ణయుగమని కొనియాడారు. బాబు అమలుచేస్తున్న నదుల అనుసంధాన విధానాన్ని దేశంలోని ఎంపిలు అభినందిస్తున్నారని, అదే తనను ఆలోచింపచేసిందన్నారు. టిడిపికి మద్దతునిస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన బాబు, ఇప్పుడు తగినంత నిధులు లేకపోయినా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్న తీరు కూడా తన నిర్ణయానికి మరో కారణమని చెప్పారు. బాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ప్రకటించేందుకే తాను వచ్చానని, బాబుకు తన సహకారం ఎప్పటికీ ఉంటుందన్నారు. తన భర్త వైసీపీ నాయకత్వంతో కొంత విభేదించినా తాను మాత్రం మనస్ఫూర్తిగానే పనిచేశానని, అయినా తనను ఎందుకు సస్పెండ్ చేశారో అర్థం కావడం లేదని వాపోయారు. దాన్ని విశే్లషించేంత అనుభవం కూడా తనకు లేదన్నారు.
రేణుక చేరికను స్వాగతిస్తున్నా: కెఇ
కర్నూలు ఎంపి బుట్టా రేణుక పార్టీలో చేరడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, నియోజకవర్గంలో ముందస్తుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు ఉండడం వల్ల ఆమెతోపాటు ముఖ్యమంత్రి దగ్గరకి రాలేకపోయానని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. టిడిపి సిద్ధాంతాలు నచ్చి వచ్చేవారు ఎవరైనా పార్టీలో చేర్చుకుంటామని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పష్టంగా చెప్పారన్నారు. తమ నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా తామందరం బద్ధులమై ఉంటామని తాను మొదటి నుంచి చెబుతున్నానన్నారు.

చిత్రం..కర్నూలు ఎంపి బుట్టా రేణుక అనుచరులతో వచ్చి తనను కలిసిన సందర్భంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు. చిత్రంలో మంత్రులు కాలవ, అఖిలప్రియ, మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి