ఆంధ్రప్రదేశ్‌

రేవంత్‌పై రాద్ధాంతం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ-ఏపి
కేడర్‌కు నాయకత్వం ఆదేశం
ఇరు రాష్ట్రాల నేతలతో లోకేష్ చర్చ
రేవంత్ ఆంధ్రాలో పనులు చేసుకోలేదా?
మీరే ప్రోత్సహించారన్న తెలంగాణ నేతలు
రేవంత్ ఆరోపణలపై ఏపిలో కలకలం
రేవంత్‌కు వ్యతిరేకంగా పరిటాల పోస్ట్
నేడు హైదరాబాద్‌లో నేతలతో లోకేష్ భేటీ?

అమరావతి, అక్టోబర్ 18: ఏపి మంత్రి పరిటాల సునీత కొడుకు శ్రీరాం పెళ్లి సందర్భంలో ఏపి టిడిపి నేతల అత్యుత్సాహంతోపాటు, తెలంగాణలో ఏపి మంత్రులు పనులు చేసుకుంటున్నారంటూ టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తాజాగా చేసిన ఆరోపణలు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. దీనితో నష్టనివారణకు దిగిన నాయకత్వం ఆయన వ్యాఖ్యలపై రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులెవరూ స్పందించి అనవసర రాద్ధాంతం చేయవద్దని ఆదేశించింది. రేవంత్‌రెడ్డి తాజా ఆరోపణలపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం రెండు రాష్ట్రాల సీనియర్లతో ఫోన్‌లో మాట్లాడి, వాటిపై విశే్లషించినట్లు సమాచారం.పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. రెండు తెలుగురాష్ట్రాల పార్టీ నేతలతో ఫోన్‌లో మాట్లాడిన లోకేష్, రేవంత్ వ్యాఖ్యలపై ఎవరూ అతిగా స్పందించవద్దని, అందరూ సంయమనం పాటించాలని సూచించినట్లు తెలిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన రేవంత్ బుధవారం మీడియాతో చిట్‌చాట్ చేసిన వైనం టివి చానెళ్లలో రావడం పార్టీ నాయకత్వాన్ని ఇబ్బందిపెట్టినట్టయింది. వెంటనే ఆ పార్టీ సీనియర్ నేత అరవిందకుమార్ గౌడ్ స్పందిస్తూ, రేవంత్ పార్టీ నుంచి వెళ్లినా నష్టమేమీలేదని, గతంలో అంతకంటే పెద్దవాళ్లే వెళ్లిపోయారని, ఒక నాయకుడు వెళితే వందమంది నేతలను తయారుచేసుకుంటామని స్పష్టం చేశారు. దానితో తెలంగాణ నేతల్లో కదలిక వచ్చి నాయకత్వాన్ని సంప్రదించి రేవంత్‌పై ఎలాంటి వైఖరి అనుసరించాలని కోరారు. దానితో ఎన్నికల వరకూ పార్టీపై దృష్టి సారించాలని, పొత్తులపై నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, దానికి సంబంధించి ఎవరు మాట్లాడినా అది వ్యక్తిగత నిర్ణయమే తప్ప పార్టీ నిర్ణయం కాదంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ మరో ప్రకటన విడుదల చేసినప్పటికీ అందులో ఎక్కడా రేవంత్ లేకుండా జాగ్రత్తపడ్డారు. అంతకంటే ముందు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన లోకేష్ ఇదంతా మీడియా సృష్టేనని, రేవంత్ కేసుల పని మీద ఢిల్లీకి వెళ్లారన్న సమాచారం తనకుందని, మీడియా వార్తలపై తాను జవాబు చెప్పనని కొట్టిపారేశారు. ఆ తర్వాత తెలంగాణకు చెందిన పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విజయవాడకు వచ్చి లోకేష్‌ను కలిశారు. రేవంత్‌రెడ్డి ఆరోపణల నేపథ్యంలో వారిద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. రేవంత్‌రెడ్డి అసంతృప్తికి కారణాలను సండ్ర వివరించినట్లు తెలిసింది. తెలంగాణకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తనకు ఇవ్వాలన్నది రేవంత్ కోరికగా సండ్ర వివరించినట్లు సమాచారం. అనంతరం మీడియాతో మాట్లాడిన సండ్ర తాను గతంలోనే లోకేష్ అపాయింట్‌మెంట్ తీసుకున్నానని, రేవంత్ గురించి మాట్లాడలేదని చెప్పారు. ఇదిలాఉండగా, లోకేష్ గురువారం హైదరాబాద్‌లోనే దీపావళి పండుగ చేసుకోనున్నారు. ఈ సందర్భంగా టిటిడిపి నేతలతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, తమ మంత్రులు తెలంగాణలో పనులు చేసుకుంటున్నారన్న రేవంత్ ఆరోపణలపై ఏపి టిడిపి నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ ఆరోపణల నేపథ్యంలో మంత్రి పరిటాల కొడుకు శ్రీరాం ఫేస్‌బుక్ అకౌంట్ పేరుతో రేవంత్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఒక పోస్టింగ్ చర్చనీయాంశమయింది. పెళ్లికి వచ్చిన పెద్ద కాళ్లకు నమస్కరించడం తప్పా? మీరెప్పుడూ ఇతర పార్టీ నేతల ఇళ్లలో జరిగిన పెళ్లిళ్లకు వెళ్లలేదా? పార్టీ మారేందుకు మరో కారణాలు వెతుక్కోవాలే కానీ, సీఎం పీఠం కోసం దిగజారాల్సిన పనిలేదు. కేసీఆర్ వ్యతిరేకత పేరుతో హడావిడి చేసి, అందరినీ కలిపి ఉద్యమాలు చేసి ఇప్పుడు పరిస్థితి నీ కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాత, క్యాడర్ ఛీ కొట్టకుండా కారణాలు వెతుకుతున్నావుఅని పోస్టు చేశారు.